Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పండుగ ఈరోజు రానే వచ్చింది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సైతం సంబరాలు జరుపుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి మహేష్ బాబు పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ పేరు సంపాదించిన మహేష్ బాబు చైల్డ్ యాక్టర్ గా కూడా పలు సినిమాలలో నటించారు. 1979లో వచ్చిన నీడ చిత్రంలో మహేష్ బాబు అతిథి పాత్రలోకనిపించారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు..
అలా ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్ బాబు 1999లో వచ్చిన రాజకుమారుడు చిత్రంతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్ బాబు పోకిరి, అతడు, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను, శ్రీమంతుడు , గుంటూరు కారం తదితర చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. మహేష్ బాబు బర్త్ డే రోజున పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. అలా ఈసారి దూకుడు సినిమాని విడుదల చేశారు.
also read:Rithu Chowdary:రీతూ చౌదరి పెళ్లిపై షాకింగ్ కామెంట్..!
హీరోనే కాదు చిన్నారుల పాలిట దేవుడు కూడా..
తనదైన యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్న మహేష్ బాబు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఎంతో మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు, గుండె ఆపరేషన్ వంటివి చేయించారు. మహేష్ బాబు నటుడుగానే కాకుండా నిర్మాతగా పలు రకాల బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. పైగా తన సంపాదనలో 30% నిధులను పలు రకాల సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారు మహేష్ బాబు. ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం తో సహా తెలంగాణలో సిద్ధరాపురం గ్రామాలను దత్తకు తీసుకున్నారు.
also read: Rashmika mandanna:హీరోయిన్ రష్మికకు గాయం..ఆందోళనలో ఫాన్స్!
వారణాసి నుండి మహేష్ బాబు బర్తడే స్పెషల్ పోస్టర్..
ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు. తాజాగా వారణాసి (Varanasi)సినిమా నుంచి రుద్ర క్యారెక్టర్ కి సంబంధించి లుక్స్ ను విడుదల చేస్తూ ఒక పోస్టర్ని విడుదల చేశారు. రాజమౌళి స్వయంగా మహేష్ బాబుకు విషెస్ తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ హైలెట్గా మారింది. ముఖ్యంగా చాలా స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కి జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే గుర్తుండిపోయే సినిమా అంటూ రాజమౌళి ఎన్నోసార్లు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి లుక్ వైరల్ గా మారింది.
Mahesh Babu once again proves why he is the ultimate superstar, effortlessly owning the screen with his charisma, style, and commanding presence in Stunning Character Stills from #Varanasi!🔥✨ #MaheshBabu #SuperstarMaheshBabu #Varanasi #SSMB29 #Tollywood #MaheshBabuFans pic.twitter.com/HrmdWXoL4N
— Tea Time Telugu (@TeaTimeTelugu) August 9, 2026




