Saturday, August 8, 2026
HomeLATESTToxic trailer:యాక్షన్ తో అదరగొట్టేసిన యశ్.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ట్రైలర్..

Toxic trailer:యాక్షన్ తో అదరగొట్టేసిన యశ్.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ట్రైలర్..

Toxic trailer: యశ్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ మూవీ నుండి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది.

on
- Advertisement -banner Ad

Toxic trailer:కేజిఎఫ్, కే జి ఎఫ్ 2 సినిమాలతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ కి దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలాకాలం తర్వాత హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో టాక్సిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ తరుణంలో చిత్ర బృందం పలు రకాల ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది.

టాక్సిక్ ట్రైలర్ రిలీజ్..

బెంగళూరులో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈవెంట్లో చిత్ర బృందం టాక్సిక్ (Toxic trailer)థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు , నెటిజన్స్ సైతం మైండ్ బ్లోయింగ్ అయ్యేలా యాక్షన్ సీన్స్ ఉండడమే కాకుండా విజువల్స్ గ్రాండ్ నెస్ తో ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకుంది. క్రైమ్ అండ్ డ్రగ్ బ్యాగ్ డ్రాప్ లో 1950-70 లో పీరియాడిక్ సినిమాగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే చాలా స్పష్టమవుతుంది. గోవా నేపథ్యంలో సాగే ఈ కథలో యశ్ పవర్ఫుల్ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Keerthy Suresh:నెటిజన్ కి అదిరిపోయే కౌంటర్ వేసిన కీర్తి సురేష్..!

ట్రైలర్ పై ప్రశంసలు..

మలయాళం స్టార్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టేకింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్గా నిలిచింది. టాక్సిక్ సినిమాలోని ట్రైలర్ లోని యాక్షన్ సీన్స్ మరొక స్థాయికి తీసుకువెళ్లాయని చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి వంటి క్రేజీ హీరోయిన్స్ ఇందులో నటిస్తున్నారు. కెవిఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పైన ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలలో ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -
Advertisement

also read:Rithu Chowdary:రీతూ చౌదరి పెళ్లిపై షాకింగ్ కామెంట్..!

తండ్రి కొడుకులు గా యశ్..

ముఖ్యంగా హీరో యశ్ ఇందులో తండ్రి కొడుకుల పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా పైన ట్రైలర్ తో మరొకసారి అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. ఇందులో బోల్డ్ కంటెంట్ కూడా కొంతమేరకు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. యశ్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న బాలీవుడ్ రామాయణం సినిమాలో రావణ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఈ ఏడాది దీపావళికి ఒక భాగం, వచ్చే ఏడాది దీపావళికి రెండవ భాగాన్ని విడుదల చేయబోతున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఒకేసారి రెండు సినిమాలను విడుదల చేయబోతున్నారు యశ్.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you