Monday, August 10, 2026
HomeLATESTOTT:నో ముద్దులు, నో ఫైట్ సీన్స్..అయినా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది!

OTT:నో ముద్దులు, నో ఫైట్ సీన్స్..అయినా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది!

OTT:కార్తి నటించిన సత్యం సుందరం సినిమా ఓటీటీలో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

on
- Advertisement -banner Ad

OTT:థియేటర్లలో పలు సినిమాలు బాగా సందడి చేస్తున్నాయి. దానికి గట్టి కాంపిటీషన్ ఇస్తూ ఓటీటీలో కూడా కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకవైపు ఓటీటీలో కొత్త సినిమాలో స్ట్రీమింగ్ అవ్వడంతో పాటు గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు కూడా ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి. కథలో బలం ఉంటే భారీ బడ్జెట్ లేకపోయినా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఆ లిస్టులోకి యాడ్ అయిపోయింది ‘మెయియజగన్’.. తెలుగులో ఈ సినిమాను “సత్యం సుందరం” అనే పేరుతో విడుదల చేశారు.

ఫైట్స్, పాటలు లేకుండానే సెన్సేషన్:

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో యాక్షన్స్ సన్నివేశాలు పాటలు స్పెషల్ సాంగ్ ఉండడం కామన్. అయితే ‘మెయియజగన్’ మాత్రం వీటికి భిన్నంగా సాగుతుంది. ఎలాంటి హంగులు, భారీ యాక్షన్ సీన్లు లేకుండా కేవలం కధ, పాత్రలు భావోద్వేగాలతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. సింపుల్ కథనాన్ని ఎంతో ఎమోషనల్ గా తెరకేక్కించి మంచి విజయాన్ని అందుకుంది. కోట్లు ఖర్చు పెట్టి.. బిగ్ స్టార్స్ ని పెట్టి సినిమాలు తీస్తేనే జనాలు చూస్తారు అనే జనాల నోర్లు మూయించింది ఈ సినిమా అని చెప్పుకోక తప్పదు. సినిమా లోని ఎమోషన్సే ఈ మూవీ హిట్ కి ప్రధాన కారణం.

- Advertisement -
Advertisement

also read:Nayanthara: యశ్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార..!

కార్తీ , అరవిందస్వామి నటనకు ప్రశంసలు :

సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ , అరవిందస్వామి ప్రధాన పాత్రలో నటించారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు.. వారి నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ కాన్సెప్ట్ తో హృదయాన్ని అత్తుకునే కథతో సీన్స్ ను చాలా భావోద్వేగంగా తెరకెక్కించారు డైరెక్టర్. ముఖ్యంగా భావోద్వేగా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి అని చెప్పడంలో సందేహమే లేదు. కార్తి అల్లరి, నాటీ సీన్స్ అరవిందస్వామి హుందాగా నటించిన సీన్స్ పై జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు నటన పరంగా సూపర్బ్ అనిపించుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Varanasi:వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్..!

8.4 IMDB రేటింగ్ తో ప్రత్యేక గుర్తింపు:

2024లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన సొంతం చేసుకుంది తెలుగులోనూ “సత్యం సుందరం”గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీ(OTT) లోను ఈ చిత్రానికి మంచి ఆదరణ కొనసాగుతుంది. ఏళ్లు గడుస్తున్న ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టుకోవడం ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

- Advertisement -
Advertisement

“96” లాంటి ఎమోషనల్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సి. ప్రేమ్ కుమార్ ఈ సినిమాను కూడా అదే తరహా భావోద్వేగాలతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వారు ఓటీటీలో తప్పక చూడాల్సిన ఎమోషనల్ డ్రామాల్లో దీనిని ఒకటిగా చెప్పొచ్చు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you