Monday, August 10, 2026
HomeLATESTMamitha Baiju:సంచలన నిర్ణయం తీసుకున్న మమితా బైజు!

Mamitha Baiju:సంచలన నిర్ణయం తీసుకున్న మమితా బైజు!

Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమత తాజాగా తన కెరీర్లో తీసుకున్న కీలక నిర్ణయం పై ఊహించని కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Mamitha Baiju:టాలీవుడ్, కోలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ప్రేమలు బ్యూటీ మమితా బైజు. నిరంతరం ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. తాజాగా విజయ్ నటించిన జననాయగన్ సినిమాలో నటించడమే కాకుండా సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇటువంటి తరుణంలోని మమితా బైజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తిగా చూద్దాం.

మమిత బైజు కీలక నిర్ణయం..

మమిత బైజుకి(Mamitha Baiju) సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే తాను మానసిక ప్రశాంతతకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని.. ఇకపై వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్లను షేర్ చేయను అంటూ తెలియజేసింది. తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఇకమీదట పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తామని తెలియజేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మమిత తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Toxic:‘టాక్సిక్’ ట్రైలర్ ఈవెంట్‌లో గీతూ మోహన్ దాస్ ఎమోషనల్..!

ఆ హీరో అంటే చాలా ఇష్టం..

ఈ సందర్భంగా మమితా బైజు మాట్లాడుతూ.. “తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీర అభిమానిని అని, ఆయన సినిమాలను పదిసార్లకు పైగా చూస్తూ ఉంటానని తెలిపింది. ముఖ్యంగా ఇద్దరమ్మాయిలు సినిమాలో అల్లు అర్జున్ వాడిన క్యాషియో వాచ్, ఫుల్ స్లీవ్ టీ షర్ట్ చాలా స్టైలిష్ గా ఉంటాయని, తాను కూడా ఎన్నోసార్లు ఆ స్టైల్ ని కాపీ చేసేదాన్ని తెలియజేసింది. కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమిత తండ్రి డాక్టర్, మమిత కూడా సైకలాజిలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక తన అన్నయ్య మిధున రాష్ట్రస్థాయి క్రికెటర్ అని తెలిపింది. తన జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలను తన అన్నయ్య తీసుకుంటారంటూ తెలియజేసింది మమితా బైజు.

- Advertisement -
Advertisement

also read:Vijay:సంగీత నిజంగానే దేవత.. విడాకుల పిటీషన్ ఎందుకు వెనక్కి తీసుకుందో తెలుసా..?

నా విషయంలో ఆయనదే తుది నిర్ణయం..

తన పెళ్లి విషయంలో కూడా తన అన్నయ్యదే తుది నిర్ణయం అని , తనకు వచ్చే లవ్ ప్రపోజల్స్ కూడా ఆయనే డీల్ చేస్తూ ఉంటారంటూ తెలిపింది. ప్రస్తుతం మమితా వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. సూర్య సరసన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో జోడిగా నటిస్తోంది. ఈ సినిమా మూడు భాషలలో విడుదల కాబోతోంది. ప్రేమలు చిత్రం ద్వారా అన్ని భాషలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దక్షిణాదిలో వరుసగా సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటోంది. అయితే తనకు పాత్ర నచ్చితే మాత్రం ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. అయితే మమితా బైజు తీసుకున్న నిర్ణయం పైన అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you