Friday, August 21, 2026
HomeLATESTAnil Ravipudi: జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి టైటిల్ అదుర్స్..!

Anil Ravipudi: జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి టైటిల్ అదుర్స్..!

Anil Ravipudi: ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ టైటిల్ విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Anil Ravipudi:టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా పేరు సంపాదించిన వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న డైరెక్టర్ తాజాగా మరోసారి సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

అనిల్ రావిపూడి కొత్త మూవీ టైటిల్ రిలీజ్..

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. తాజాగా సినిమా టైటిల్ ని కూడా చిత్ర బృందం సరికొత్త వీడియో ద్వారా విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి #Venky Anil 5 మరియు#NKRAR 2 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని కొనసాగింపచేశారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. టైటిల్ క్యాప్షన్ కింద బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్ లైన్ ని జత చేయడం హైలైట్ గా నిలిచింది.

- Advertisement -
Advertisement

also read:Folk dancer:భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఫోక్ డాన్సర్.. వీడియో వైరల్..!

ఆకట్టుకుంటున్న టైటిల్..

వెంకటేష్ , కళ్యాణ్ రామ్ మధ్య నడిచే బావ బామ్మర్దుల మధ్య జరిగే సినిమా స్టోరీ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్ వీడియో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. మొదట ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన ఒక కామెడీ క్లిప్ అప్పుల అప్పారావు సీనుతో ఈ వీడియో మొదలవుతుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి నలుగురు కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ని టైటిల్ ఏంటని ప్రశ్నిస్తుంటారు? దానికి అనిల్ జనవరి 12 విడుదల అని సమాధానం ఇస్తూ ఉండగా.. విడుదల తేదీ కాకుండా సినిమా పేరు చెప్పండి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పగా.. చివరికి అదే టైటిల్ ని రివీల్ చేయడం వంటి సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచాయి.

- Advertisement -
Advertisement

also read: Sowcar Janaki: సీనియర్ నటి షావుకారు జానకికి అస్వస్థత..!

మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా?

ఈ వీడియోలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా చూపించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి రోజులలో అనిల్ రావిపూడి సినిమా విడుదలైందంటే చాలు కచ్చితంగా సక్సెస్ అందుకొని సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. మరి ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి తీస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం 2027 జనవరి 12న చాలా గ్రాండ్గా థియేటర్లోకి విడుదల కానుంది. మరి ఈ సినిమాకి సంబంధించి టీజర్ ,ట్రైలర్ వంటి వాటితో మరింత అంచనాలను పెంచేసేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you