Sunday, November 22, 2026
HomeLATESTDPIFF Awards 2026 Winners List: ధురంధర్ హవా.. రణవీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి అవార్డు..!

DPIFF Awards 2026 Winners List: ధురంధర్ హవా.. రణవీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి అవార్డు..!

DPIFF Awards 2026 Winners List;ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకుడు విభాగాల్లో 'ధురంధర్' ఆధిపత్యం ప్రదర్శించింది. రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు.

on
- Advertisement -banner Ad

DPIFF Awards 2026 Winners List:భారతీయ సినీ పరిశ్రమతో పాటు అంతర్జాతీయ వినోద రంగంలోనూ ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 విజేతల జాబితాను ప్రకటించారు. భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టెలివిజన్, సంగీతం, షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు అంతర్జాతీయ చిత్రాలకు సంబంధించి మొత్తం 41 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.

ఈ ఏడాది అవార్డుల్లో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు వంటి కీలక పురస్కారాలను ఈ చిత్రం సొంతం చేసుకుంది. మరోవైపు ‘కాంతార: చాప్టర్ 1’, ‘సయ్యారా’ చిత్రాలు కూడా పలు విభాగాల్లో అవార్డులు(DPIFF Awards 2026 Winners List) దక్కించుకున్నాయి.

- Advertisement -
Advertisement

భారతీయ సినిమా విభాగంలో విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకుడు విభాగాల్లో ‘ధురంధర్’ ఆధిపత్యం ప్రదర్శించింది. రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. ‘సయ్యారా’ చిత్రంతో అనీత్ పడ్డా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

క్రిటిక్స్ విభాగంలో ‘కాంతార: చాప్టర్ 1’ ఉత్తమ చిత్రంగా నిలవగా, రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. ‘హక్’ చిత్రానికి గాను యామీ గౌతమ్ ధర్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. వినీత్ కుమార్ సింగ్ (ఛావా), అక్షయ్ ఖన్నా (ధురంధర్), రితేష్ దేశ్‌ముఖ్ (హౌస్‌ఫుల్ 5) కూడా తమ నటనకు గుర్తింపు పొందారు.

- Advertisement -
Advertisement

సంగీత విభాగంలో సయ్యారా సత్తా :

సంగీత రంగంలోనూ ‘సయ్యారా’ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టైటిల్ ట్రాక్‌కు ఇర్షాద్ కమిల్ ఉత్తమ గీత రచయితగా, ఫహీమ్ అబ్దుల్లా ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎంపికయ్యారు. కరణ్ ఔజ్లా ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ‘ధురంధర్’ చిత్రానికి సంగీతం అందించిన శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు.

also read:Salman Khan:తెలుగు హీరోలతో నటించేందుకు ఎప్పుడూ సిద్ధమే.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

- Advertisement -
Advertisement

వెబ్ సిరీస్, టెలివిజన్ విజేతలు:

వెబ్ సిరీస్ విభాగంలో ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఉత్తమ సిరీస్‌గా ఎంపికైంది. ఆర్యన్ ఖాన్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ‘పాతాళ్ లోక్ 2’కు జైదీప్ అహ్లావత్, ‘ఢిల్లీ క్రైమ్ 3’కు షెఫాలీ షా అవార్డులు గెలుచుకున్నారు.

టెలివిజన్ విభాగంలో ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ ఉత్తమ సిరీస్‌గా నిలిచింది. ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’కు అమర్ ఉపాధ్యాయ్, స్మృతి ఇరానీ ఉత్తమ నటుడు, నటిగా ఎంపికయ్యారు.

also read:Shriya Saran: హాట్ అందాలతో సెగలు పుట్టిస్తున్న శ్రియా శరణ్!

అంతర్జాతీయ విభాగంలో ప్రముఖులకు పురస్కారాలు:

అంతర్జాతీయ విభాగంలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడిగా, ‘సిన్నర్స్’కు మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ‘హామ్నెట్’ చిత్రానికి జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచారు. టేలర్ స్విఫ్ట్‌కు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది.

జీవిత సాఫల్య పురస్కారాలు :

సినీ, సంగీత రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా కమల్ హాసన్, ఇళయరాజాలకు ప్రత్యేక పురస్కారాలు ప్రకటించారు. గ్లోబల్ సినిమాకు చేసిన సేవలకు ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ను సత్కరించనున్నారు.

షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘మాధురి – ఎండ్ ఈజ్ బిగినింగ్’ మొదటి స్థానంలో నిలిచింది. ‘జహాన్ – ది లాస్ట్ గిఫ్ట్’, ‘ఇన్ హాఫ్’, ‘టీ కొట్టు’ తదుపరి స్థానాలను దక్కించుకున్నాయి. ఇలా 41 విభాగాల్లో ప్రకటించిన విజేతల జాబితా సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you