Nayanthara:లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచారు. తన విలాసవంతమైన జీవనశైలికి తగ్గట్టుగా ఏకంగా రూ.10 కోట్ల విలువైన ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. కొత్త కారుతో తన భర్త విఘ్నేశ్ శివన్, ఇద్దరు కుమారులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి కొత్త కారులో సరదాగా విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు నయనతారకు అభినందనలు తెలియజేస్తున్నారు.
నయనతార కొత్త కారు ధర ఎంతంటే? :
నయనతార(Nayanthara) సొంతం చేసుకున్న కారు సాధారణమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉన్న రోల్స్ రాయిస్ సంస్థకు చెందిన బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ (Rolls-Royce Black Badge Spectre) కారును ఆమెకు భర్త విఘ్నేశ్ శివన్ బహుమతిగా అందించారు. నవంబర్ 18న నయనతార తన 41వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఆమెకు ఈ ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం.
భారత్‌లో ఈ కారు ధర సుమారు రూ.9.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యాధునిక సాంకేతికత, విలాసవంతమైన ఇంటీరియర్, ఆకర్షణీయమైన డిజైన్ ఈ కారు ప్రత్యేకతలు. సెలబ్రిటీలకు ఎంతో ఇష్టమైన రోల్స్ రాయిస్ బ్రాండ్‌లో ఈ మోడల్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
also read:DPIFF Awards 2026 Winners List: ధురంధర్ హవా.. రణవీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి అవార్డు..!
ఫ్యామిలీతో కలిసి నయనతార సందడి :
కొత్త కారుతో నయనతార తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. భర్త విఘ్నేశ్ శివన్, ఇద్దరు కుమారులతో కలిసి ఆమె ఆనందంగా కనిపించారు. కుటుంబంతో కలిసి కొత్త కారులో సరదాగా గడిపిన ఈ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నయనతారకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
also read:Salman Khan:తెలుగు హీరోలతో నటించేందుకు ఎప్పుడూ సిద్ధమే.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలతోనూ ఫుల్ బిజీగా లేడీ సూపర్ స్టార్ :
ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ఇటీవల ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
మరోవైపు ‘టాక్సిక్’, ‘హాయ్’ వంటి సినిమాలతోనూ ఆమె ప్రేక్షకులప్రేక్షకులను అలరించారు. వరుస సినిమాలతో కెరీర్లో దూసుకుపోతున్న నయనతార, వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. కుటుంబం, సినిమాలు, విలాసవంతమైన జీవనశైలితో తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు.




