Sunday, November 22, 2026
HomeLATESTSalman Khan:తెలుగు హీరోలతో నటించేందుకు ఎప్పుడూ సిద్ధమే.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Salman Khan:తెలుగు హీరోలతో నటించేందుకు ఎప్పుడూ సిద్ధమే.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Salman Khan:తెలుగు సినిమాల్లో నటించే అవకాశాల గురించి అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఆసక్తికరంగా స్పందించారు. గతంలో చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు

on
- Advertisement -banner Ad

Salman Khan:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలుగు సినీ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం వస్తే ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, పవన్ కల్యాణ్ వంటి హీరోల సినిమాల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు సినిమాలు, టాలీవుడ్ హీరోలు, తన తాజా చిత్రం గురించి పలు విషయాలను పంచుకున్నారు.

హైదరాబాద్‌లో సందడి చేసిన సల్మాన్ ఖాన్ :

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రస్తుతం ‘మాతృభూమి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్ ఖాన్ మీడియాతో ముచ్చటించారు.

- Advertisement -
Advertisement

తన గత చిత్రాలతో పోలిస్తే ‘మాతృభూమి’ విభిన్నమైన కథతో రూపొందిందని తెలిపారు. ఇప్పటివరకు పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో వచ్చిన కథల్లో నటించానని, ఈసారి చైనాతో జరిగిన యుద్ధానికి సంబంధించిన నేపథ్యాన్ని ఎంచుకోవడం కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.

also read:Shriya Saran: హాట్ అందాలతో సెగలు పుట్టిస్తున్న శ్రియా శరణ్!

- Advertisement -
Advertisement

కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ కాదన్న సల్మాన్ :

లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ‘మాతృభూమి’ ఎవరి బయోపిక్ కాదని స్పష్టం చేశారు.

కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత కథ అని వివరించారు. కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం చేసిన త్యాగాన్ని కొనియాడుతూ, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ శారీరకంగా ఎంతో సవాలుగా సాగిందని, గడ్డకట్టే చలిలో షూటింగ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:Roja:నా వెనుక మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు.. రోజా షాకింగ్ కామెంట్స్!

చిరు, చరణ్, తారక్ సినిమాల్లో నటించేందుకు రెడీ:

తెలుగు సినిమాల్లో నటించే అవకాశాల గురించి అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఆసక్తికరంగా స్పందించారు. గతంలో చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మరోసారి చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చినా సంతోషంగా అంగీకరిస్తానని తెలిపారు.

అంతేకాకుండా వెంకటేష్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వంటి హీరోలు తమ సినిమాల్లో నటించమని అడిగినా వెంటనే సిద్ధమని చెప్పారు. తెలుగులో తనకు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా.. తానే ఒక మంచి ఫేవరెట్ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నట్లు సరదాగా సమాధానమిచ్చారు.

వంశీ పైడిపల్లిపై ప్రశంసలు :

ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ సినిమా చేస్తున్న సల్మాన్ ఖాన్.. ఆయనపై ప్రశంసలు కురిపించారు. వంశీ అద్భుతమైన వ్యక్తి అని, మంచి మనసున్న మనిషి అని కొనియాడారు. సినిమా చాలా బాగా వస్తోందని, దాని గురించి మరిన్ని వివరాలు సరైన సమయంలో వెల్లడిస్తానని చెప్పారు.

ఇక ట్రోల్స్, సినిమా క్యాప్షన్ గురించి కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. కుటుంబాల్లో, ఇళ్లలో గొడవలు సాధారణమేనని, అలాంటి వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలనే సందేశంతోనే క్యాప్షన్ పెట్టినట్లు వివరించారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you