Sunday, November 22, 2026
HomeLATESTRashmika mandanna:ఆ విషయంలో భయమేసింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్!

Rashmika mandanna:ఆ విషయంలో భయమేసింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్!

Rashmika mandanna: రష్మిక మందన్న మైసా సినిమా విషయంలో ఆ ఒక్క పాట కోసం తాను భయపడ్డాను అంటూ చెప్పింది.

on
- Advertisement -banner Ad

Rashmika mandanna:పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించిన నేషనల్ క్రష్ రష్మిక తాజాగా నటిస్తున్న చిత్రం మైసా. ఈ చిత్రానికి డైరెక్టర్ రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించగా.. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, రావు రమేష్, ఈశ్వరి రావు తో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలు నటించారు. ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచేలా విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమాలోని టైటిల్ సాంగ్ ని రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఒసేయ్ రాములమ్మ పాటను రీ క్రియేషన్..

ఈ పాటను నవంబర్ 20వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో చిత్ర బృందం విడుదల చేశారు.. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ” ఒక ఐకానిక్ పాటను మళ్ళీ తెరకెక్కించడం తనకు ఇష్టమే అయినా అది పెద్ద బాధ్యతగా భావించానని” తెలియజేసింది.. 1997లో ఎంతో ముందు చూపుతో తెరకెక్కించిన ఒసేయ్ రాములమ్మ సినిమా అప్పట్లో ఒక చరిత్ర సృష్టించింది అని, అలాంటి సినిమాలోని టైటిల్ పాటను రీ క్రియేట్ చేస్తున్నామని తెలియగానే నా మనసులో కొంతమేరకు భయం మొదలయ్యిందని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Allu Aravind:నా ఎదుగుదలకు కారణం ఆ ముగ్గురే.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అక్కడ భయపడ్డాను..

ఎందుకంటే ఇది ఒక ఐకానిక్ పాట ఇలాంటి గీతాన్ని మళ్లీ రూపొందించడం అంటే అది సాహసమే.. మాతృక లోని పాటను పూర్తిగా మ్యాచ్ చేయలేము, ఆ గీతాన్ని న్యాయం చేసేలా మా వంతు ప్రయత్నం చేశామని, ఈ రిక్రియేషన్కు వందేమాతరం శ్రీనివాస్ గారు గాత్రం అందించడం మరింత ఆనందంగా ఉందంటూ రష్మిక (Rashmika mandanna)తెలియజేసింది. ఒరిజినల్ పాటకు అప్పట్లో ఎంత మంది ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపించారు ఇప్పుడు తాము రూపొందించిన ఈ కొత్త వెర్షన్ పాటకు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామంటూ రష్మిక వెల్లడించింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Nayanthara:నయన్ ఇంట్లోకి మరో న్యూ లగ్జరీయస్ కార్..ధర ఎంతో తెలుసా..?

మైసాతో మరింత విజయం అందుకోవాలంటూ..

ఒకప్పటి సంచలన చిత్రమైన ఒసేయ్ రాములమ్మ పాటను కొత్త రూపంలో వినిపించేందుకు కూడా మైసా చిత్ర బృందం చేసిన సాంగ్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తోందని చెప్పవచ్చు. ఈ ఏడాది తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన రణబాలి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మరొకసారి భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట ఇకనుంచి విజయ్ దేవరకొండ నటించే సినిమాలు ఏవి కూడా టికెట్ల రేటు పెంచకుండా ఉంటానని తెలియజేశారు. ఓటిటిలో కూడా రణబాలి సినిమా మరింత దూసుకుపోతోంది. మరి రష్మిక మైసా సినిమాతో ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న రాకా అనే సినిమాలో కూడా కీలకమైన పాత్రలో రష్మిక నటించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you