Friday, August 21, 2026
HomeLATESTDC movie:డీసీ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..?

DC movie:డీసీ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..?

DC movie: ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజు హీరోగా మారి చేసిన డిసి సినిమా ఇప్పుడు ఓటిటీ స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధమయ్యింది.

on
- Advertisement -banner Ad

DC movie:సాధారణంగా డైరెక్టర్లు సైతం హీరోగా నటించడం చాలా తక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా తమిళ డైరెక్టర్లు మాత్రం ఎక్కువగా అన్ని విభాగాలలో కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన డైరెక్టర్లలో లోకేష్ కనగారాజ్ కూడా ఒకరు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం డీసీ. ఈ సినిమా గత రెండు వారాలుగా ఎక్కువగా వినిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ గా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని కలెక్షన్స్ రాబట్టడంతో పాటుగా ఇందులో నటించిన లోకేష్ కనకరాజు యాక్టింగ్ హీరోయిన్స్ నటన హైలెట్గా నిలిచింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలు సైతం డిసి సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఓటిటి స్ట్రీమింగ్ కి రాబోతున్న డీసీ..

ఖైదీ, లియో, మాస్టర్, కూలీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. అలాగే మరొక హీరోయిన్ వామిక గబ్బి ఇందులో అద్భుతంగా నటించగా.. ఆగస్టు 7న తమిళ్, తెలుగు భాషలలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 75 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీ సినిమా ఎప్పుడు ఓటీటిలోకి వస్తుందా అని అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Anil Ravipudi: జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి టైటిల్ అదుర్స్..!

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

డీసీ(DC movie) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా మేకర్స్ కూడా ప్రకటించారు. కానీ ఓటిటి స్ట్రీమింగ్ డేటు మాత్రం అనౌన్స్మెంట్ చేయలేదు. థియేటర్లలో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో తీసుకువచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం సెప్టెంబర్ 11వ తేదీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Sowcar Janaki: సీనియర్ నటి షావుకారు జానకికి అస్వస్థత..!

లోకేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్..

ఇప్పటికే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కాబట్టి ఓటిటీ రిలీజ్ డేట్ ఇంకా పొడిగించే అవకాశాలు కూడా మరింత కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి బిజిఎం కూడా హైలెట్గా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ అందించారు. ఇందులో మరొక హీరోయిన్ సంజన కృష్ణమూర్తి నటించింది. గతంలో డైరెక్టర్ గా మాత్రమే అందరినీ ఆకట్టుకున్న లోకేష్ కనకరాజు ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. ఏది ఏమైనాప్పటికీ మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు లోకేష్ కనగరాజ్.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you