Friday, August 21, 2026
HomeLATESTHemachandra:విడాకులపై హేమచంద్ర సెన్సేషనల్ కామెంట్స్..ఇక కళ్లు చల్లబడ్డాయా..?

Hemachandra:విడాకులపై హేమచంద్ర సెన్సేషనల్ కామెంట్స్..ఇక కళ్లు చల్లబడ్డాయా..?

Hemachandra:ప్రముఖ సింగర్ హేమచంద్ర తన భార్య, గాయని శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై తొలిసారి స్పందించారు.

on
- Advertisement -banner Ad

Hemachandra:హేమచంద్ర.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడిగా ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. ఇంకెన్నో పాటలు పాడాడు. అంతకన్నా మంచి మనసున్న వ్యక్తిగా సోషల్ మీడియాలో ఇప్పుడు అభిమానులను సంపాదించుకుని, అభిమానుల చేత ప్రశంసలు దక్కించుకుంటూ ఉంటాడు. ఆయన సినిమాల పరంగా, తన ప్రొఫెషన్ పరంగా ఎప్పుడూ సోషల్ మీడియాలోకి గురి కాలేదు. కానీ ఈ మధ్యకాలంలో హేమచంద్ర వ్యక్తిగత జీవితం పై, ముఖ్యంగా ఆయన భార్య శ్రావణ భార్గవితో విడాకులు తీసుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలు చాలా మంది అభిమానులను బాధపెడుతున్నాయి.

విడాకుల వార్తలపై ఇప్పటికే క్లారిటీ:

దీనిపై ఇప్పటికే చాలాసార్లు అటు శ్రావణ భార్గవి, ఇటు హేమచంద్ర.. ఇది తమ పర్సనల్ అని, అలాంటిదేమీ లేదు అని కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా పదేపదే హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్‌లో రకరకాల థంబ్‌నెయిల్స్ పెట్టి, వాళ్ల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా కొన్ని వీడియోలు చిత్రీకరిస్తున్నారు.

- Advertisement -
Advertisement

యూట్యూబ్ ఛానల్స్‌పై హేమచంద్ర ఆగ్రహం:

ఇన్నాళ్లు ఓపికతో సహించిన హేమచంద్ర(Hemachandra) తాజాగా అలాంటి వీడియోలపై మండిపడ్డాడు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తమపై చెలరేగుతున్న ఊహాగానాలపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్లిక్‌బైట్ కోసం, వ్యూస్ కోసం దారుణమైన థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేస్తున్నారు అంటూ హేమచంద్ర కోప్పడ్డారు. ఆవేదన వ్యక్తం చేశారు.

also read:Irumudi :ఇరుముడి మూవీ రివ్యూ: రవితేజ కెరీర్‌లో డిఫరెంట్ ఎమోషనల్ జర్నీ.. ఎలా ఉందంటే?

- Advertisement -
Advertisement

మా ఇంట్లో జరగని విషయాన్ని ఎలా చిత్రీకరిస్తారు?:

తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు రూపొందించిన ఒక వీడియో థంబ్‌నెయిల్‌ను ప్రస్తావిస్తూ తన బాధను వ్యక్తపరిచారు. మా ఇంట్లో ఎప్పుడూ జరగని విషయాన్ని ఎలా చిత్రీకరిస్తారు? మైండ్ దొబ్బిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రియేటివిటీ చూపించడానికి వేరే మార్గాలు ఎంచుకోండి. ఇలా కుటుంబ సభ్యులతో, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే విధంగా వీడియోలు చిత్రీకరించకండి. ఎవరైనా కుట్రపూరితంగా ప్రచారాలు చేసినప్పుడు వాటికి అనవసరంగా బహిరంగ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Advertisement

also read:Unmadam:థియేటర్లలో అదరగొట్టిన థ్రిల్లర్ మూవీ ఓటీటీలో.. అస్సలు మిస్ అవ్వకండి!

తన ఆల్బమ్ వినాలని సూచించిన హేమచంద్ర:

తన భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి రీసెంట్‌గా ‘ADHD’ అనే ఆల్బమ్ చేశాను. అది వినాలి అని హేమచంద్ర సూచించారు. ఆ ఆల్బమ్ వింటే ఖచ్చితంగా తన మనస్తత్వం అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాదు.. తన భార్య శ్రావణ భార్గవి గురించి మాట్లాడుతూ ఆమె ఒక మంచి, అద్భుతమైన సింగర్ అని, మెటీరియల్ అని అన్నారు. ఆమెలో ఉన్న టాలెంట్ ఇంకా ఇండస్ట్రీకి చాలా అవసరం అని, ఇండస్ట్రీ ఇంకా ఆమెను పూర్తిగా టాలెంటెడ్‌గా చూడలేదు అని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో హేమచంద్ర మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you