Saturday, August 29, 2026
HomeLATESTActress: నెగిటివ్ పాత్రలకే మక్కువ చూపుతున్న సెలబ్రిటీస్..!

Actress: నెగిటివ్ పాత్రలకే మక్కువ చూపుతున్న సెలబ్రిటీస్..!

Actress: ఇటీవల కాలంలో హీరోయిన్లు ఎక్కువగా నెగిటివ్ పాత్రలకే మొగ్గు చూపుతూ తమలోని టాలెంట్ను తెరపైకి తీసుకొస్తూ పాపులారిటీ పెంచుకుంటున్నారు.

on
- Advertisement -banner Ad

Actress: చాలామంది హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. వారు నటించిన సినిమాలేవి కూడా వారికి మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో విభిన్నంగా కొంతమంది హీరోయిన్స్ నెగిటివ్ పాత్రలలో కనిపించి అద్భుతంగా ఆకట్టుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కూడా నెగిటివ్ పాత్రలలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సినిమాలో వారికి ఎంత స్క్రీన్ టైం ఉంది అనేది ముఖ్యం కాదు తాము నటించిన పాత్ర జనాలని ఎంతగా ప్రభావితం చేసింది అనేది ముఖ్యం అనే విధంగా ఆలోచిస్తున్నారు.

నెగిటివ్ రోల్ వైపు మొగ్గు చూపుతున్న హీరోయిన్స్..

సినిమాలలో విలన్ అంటే కేవలం మేల్ ఆర్టిస్టులు (Actress)మాత్రమే కాదు ఫిమేల్ ఆర్టిస్టులు కూడా చేయగలరని నిరూపించారు. హీరోలను సైతం ఢీకొట్టే స్థాయిలో బలమైన పాత్రలలో నటించిన వారు కూడా ఉన్నారు అలా 2021లో రవితేజ నటించిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన తీరు అందరి చేత ప్రశంసలు కురిపించింది. అప్పటివరకు వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా నటించింది. కానీ తెలుగులో మొదటిసారి నెగిటివ్ పాత్రలో జయమ్మ గా నటించి ప్రశంసలు అందుకుంది. జయమ్మ పాత్ర తన కెరియర్ లోనే ప్రత్యేకమని కూడా తెలియజేసింది. అలా ఆ తర్వాత వీర సింహారెడ్డి చిత్రంలో నెగిటివ్ షేడ్ పాత్రలో కనిపించింది.

- Advertisement -
Advertisement

also read:Samantha:మాతృత్వం పై సమంత కామెంట్స్..!

దాక్షాయనిగా అదరగొట్టేసిన అనసూయ..

ఒకప్పుడు యాంకర్ గా అదరగొట్టేసిన అనసూయ ఎన్నో చిత్రాలలో నటిగా నటించింది. కానీ అనసూయకు పుష్ప, పుష్ప 2 చిత్రాలలో దాక్షాయని పాత్ర మాత్రం ప్రత్యేకమని చెప్పవచ్చు. ఆ పాత్ర ప్రేక్షకులను మరింత ఆకర్షించింది. సాధారణంగా కనిపించే గృహిణి పాత్రకు చాలా భిన్నంగా కనిపిస్తూ కోపం , అసూయ, ప్రతీకారంతో కూడిన పాత్రలలో కనిపించింది అనసూయ. దీంతో పలు చిత్రాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంది అనసూయ. ప్రస్తుతం యాంకరింగ్ వైపుకి దూరంగా ఉంటూ సినిమాల వైపే ఫుల్ ఫోకస్ పెట్టింది అనసూయ . అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

- Advertisement -
Advertisement

also read:Toxic movie: కళ్ళు చెదిరే ధరకు టాక్సిక్ ఓటీటీ రైట్స్!

ఇరుముడి సినిమాలో స్వాసిక నటన అద్భుతం..

ఇప్పుడు తాజాగా రవితేజ నటించిన ఇరుముడి చిత్రంలో స్వాసిక పోషించిన పాత్ర కూడా జయమ్మ పాత్ర కేటగిరీలో కనిపిస్తోంది . ఇందులో టీచర్ గా నెగిటివ్ పాత్రలో కనిపించిన ఈమె తీరు , డైలాగ్ డెలివరీ కూడా అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో కథలో కీలకమైన సందర్భాలలో ఈమె పాత్ర సినిమా పైన చాలా ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. ఈ పాత్రతో మరిన్ని అవకాశాలు తీసుకువచ్చేలా ఉన్నాయి. వీరే కాకుండా అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ, త్రిష వంటి సెలబ్రిటీలు కూడా ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలలో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఇలా వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా విలన్ గా నటించడానికి మక్కువ చూపుతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you