Bigg Boss :బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభంలోనే ఈసారి గేమ్ మామూలుగా ఉండదని హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే.. హౌస్‌లో వరుసగా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. షో ప్రారంభమైన నాలుగు రోజులకే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే తొమ్మిది సీజన్లను చూసి, అనుభవంతో గేమ్ ఆడేందుకు వచ్చిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ తనదైన స్టైల్లో షాకులు ఇస్తున్నాడు.
ఇకపై ఆట అంతా ఇండివిడ్యువల్ :
ఇప్పటివరకు రెడ్, బ్లూ టీమ్స్‌గా విడిపోయి గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ కొత్త రూల్ పెట్టాడు. ఇకపై టీమ్ గేమ్‌కు స్వస్తి పలికి, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పోరాడాల్సి ఉంటుందని ప్రకటించాడు. దీంతో హౌస్‌లో అసలు గేమ్ మొదలైనట్టయింది. ఎత్తుకు పైఎత్తులు, వ్యూహాలు, వ్యక్తిగత పోటీలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.
ALSO READ:418 Trailer:వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘418’ ట్రైలర్.. ఆ రూమ్‌లో అసలేం జరిగింది?
‘రన్ రాజా రన్’ టాస్క్‌లో ట్విస్ట్ :
కంటెస్టెంట్లను నో రిస్క్, హై రిస్క్ జోన్లుగా విభజించేందుకు ‘రన్ రాజా రన్’ అనే టాస్క్‌ను బిగ్ బాస్(Bigg Boss )ఇచ్చాడు. ఏడుగురు ఈజీ టాస్క్, ఇద్దరు డిఫికల్ట్ టాస్క్ ఆడేలా కంటెస్టెంట్లే తమను తాము ఎంపిక చేసుకున్నారు. సుధీర్ రెడ్డి, వర్షిణి కఠినమైన టాస్క్‌కు వెళ్లగా.. మిగిలిన వారు ఈజీ టాస్క్‌ను ఎంచుకున్నారు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు.
టాస్క్‌లో రామ్ ప్రసాద్ విజయం సాధించి నో రిస్క్ జోన్లోకి వెళ్లాడు. అయితే మరో కంటెస్టెంట్‌ను హై రిస్క్ జోన్లోకి పంపాల్సి రావడంతో అమన్ పేరును సూచించాడు. అమన్ గెలిచే సత్తా ఉందనే నమ్మకంతోనే అతడిని ఎంపిక చేశానని రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చినా.. హౌస్‌లో ఈ నిర్ణయంపై చర్చ మొదలైంది.
ALSO READ:TV:శనివారం టీవీ ముందు నుంచి కదలరు.. వరుసగా అదిరిపోయే సినిమాలు!
కేక్ టాస్క్‌తో మరో మలుపు :
తర్వాత సుధీర్, వర్షిణి కూడా నో రిస్క్ జోన్లోకి వెళ్లారు. అయితే వారిద్దరి మధ్య కేక్ పెట్టి, దాన్ని ఎంత సమయంలో తింటారో చెప్పేలా బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. చెప్పిన సమయంలో పూర్తి చేయకపోతే తిరిగి హై రిస్క్ జోన్లోకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
అంతటితో ఆగకుండా కేక్‌ను పాడు చేసి, ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ హౌస్‌మేట్స్‌ను నమ్మించాలని బిగ్ బాస్ కొత్త మెలిక పెట్టాడు. అయితే సుధీర్, వర్షిణి ఈ టాస్క్‌లో ప్రేక్షకులను మాత్రమే కాదు.. హౌస్‌మేట్స్‌ను కూడా నమ్మించలేకపోయారు. చివరకు ఇది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అని సభ్యులే గుర్తించే పరిస్థితి వచ్చింది.
చైత్రకు షాక్.. నాలుగో రోజే ఎలిమినేషన్ :
టాస్క్‌పై సీరియస్‌గా వ్యవహరించలేదంటూ బిగ్ బాస్ ఇద్దరినీ మందలించి మళ్లీ హై రిస్క్ జోన్లోకి పంపించాడు. చైత్ర, వర్షిణి, సుధీర్, అమన్‌లను హై రిస్క్‌లో ఉంచి.. ఈ నలుగురిలో ఒకరు అదే రోజు ఎలిమినేట్ అవుతారని ప్రకటించాడు.
వీరిలో ముగ్గురు చైత్ర పేరును సూచించడంతో ఆమెకు ఎలిమినేషన్ తప్పలేదు. తనకు సరైన అవకాశం రాలేదని, తాను బలహీనమైన కంటెస్టెంట్ కాదని చైత్ర చెప్పుకున్నప్పటికీ.. ఓట్లు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో చైత్ర బిగ్ బాస్ హౌస్‌ను వీడింది.
ఇప్పటికే చరణ్ ఎలిమినేట్ కాగా.. తాజాగా చైత్ర కూడా బయటకు వెళ్లడంతో హౌస్‌లో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే చరణ్, చైత్ర ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటాడా? అనే చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది.




