Namitha:తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో ఎంతో మంది హీరోలతో నటించిన నమిత.. పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా అలరించింది. అయితే గడిచిన ఆరేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నమిత.. ఇటీవల స్లిమ్ గా మారి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంది నమిత. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత.. భారతీయ వివాహ వ్యవస్థ, మహిళలపై జరుగుతున్న దాడుల పైన కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
మగవాళ్లకు లేని నిబంధనలు ఆడవాళ్లకే ఎందుకు?
మగవాళ్లకు లేని కొన్ని నిబంధనలను కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఎందుకంటూ ఆమె ప్రశ్నించింది. ముఖ్యంగా భర్త దీర్ఘాయుష్షు కోసం ఆడవారు చేసే వరలక్ష్మీ వ్రతం వంటి ఆచారాల పైన కూడా నమిత స్పందించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఆడవాళ్లే తాళి ఎందుకు ధరించాలి? మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి ? మగవాళ్లకు లేని ఈ నిబంధనలు ఆడవాళ్ళకే ఎందుకు? భర్త సుఖంగా ఉండాలని ఉపవాసం ఉంటాను. కానీ భార్య క్షేమం కోసం భర్త ఏడాదిలో కనీసం ఏ ఒక్కరోజు అయినా కూడా ఉపవాసం చేయాలని నియమం ఉందా? అలాంటిదేమీ లేదు కదా! సమాజం ఇలాంటివి ఎందుకు సృష్టించలేదు అని, ఇలాంటి నిబంధనలు మహిళలకే ఎందుకు అంటూ నమిత తన అభిప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం నమిత(Namitha) చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:Bigg Boss :చైత్ర ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో కొత్త చర్చ.. అసలేం జరిగింది?
నమిత సినిమాలు..
నమిత తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే.. సొంతం సినిమాతో హీరోయిన్గా పరిచయమైన నమిత.. ఆ తర్వాత జెమిని, బిల్లా, సింహ, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి చిత్రాలలో నటించింది. నమిత తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల్లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. 2017లో బిజినెస్ మాన్ వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న నమిత.. తన 41వ పుట్టినరోజున తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. 2022లో నమిత కవల పిల్లలకు జన్మనిచ్చారు.
also read:418 Trailer:వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘418’ ట్రైలర్.. ఆ రూమ్‌లో అసలేం జరిగింది?
నమిత వ్యక్తిగత జీవితం..
నమిత చివరిగా 2020లో మీమా అనే ఒక తమిళ సినిమాలో నటించిన ఈమె.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది.. అందుకే ఎక్కువగా జిమ్ వర్కౌట్ చేస్తూ స్లిమ్ గా మారిన ఫోటోలు ఇటీవల కాలంలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. మరి నమిత కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మొత్తానికి మహిళల పైన నమిత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.




