Pranay Vanga:ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన రివ్యూలు ఎంత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయో అందరం చూస్తున్నాం. కొంతమంది పాజిటివ్‌గా ఉంటే.. మరికొంతమంది నెగిటివ్‌గా రివ్యూలు ఇస్తున్నారు. కొంతమంది జెన్యూన్‌గా సినిమా బాగోలేకపోతే బాగోలేదు అంటూ రివ్యూలు ఇస్తున్నారు. కానీ మరికొంతమంది మాత్రం డబ్బులు తీసుకుని సినిమా బాగున్నా సరే దానిపై నెగిటివ్‌గా రాస్తూ వస్తున్నారు. ఇది గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో జరుగుతూనే వస్తుంది.
రివ్యూలపై పలువురు స్టార్స్ స్పందన :
ఈ విషయంపై పలువురు స్టార్స్ కూడా స్పందించారు. సినిమా చూసి రివ్యూ ఇవ్వండి.. మా కష్టాన్ని వృథా కానివ్వకండి అంటూ చాలా బోల్డ్‌గా స్పందించారు. అయితే ఈ విషయంలో కూసింత ఘాటుగా స్పందించాడు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా(Pranay Vanga). తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి.
also read:The Paradise:నాని ప్యారడైజ్ సినిమా విషయంలో సంచలన నిర్ణయం..!
‘రోమాంచకం’పై మిశ్రమ స్పందన :
దీనికి కారణం ఇటీవల ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ సినిమాపై వచ్చిన మిశ్రమ స్పందనే. సినిమా చాలా బాగుందని కొందరు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇచ్చారు. కొంతమంది సూపర్ హిట్ అన్నారు. మరికొంతమంది సినిమా బాగున్నా.. సినిమాలోని నెగిటివ్ ఏంటి అనేది కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కానీ కొందరు మాత్రం ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ‘రోమాంచకం’ను టార్గెట్ చేసినట్లే అనిపించింది. సినిమాలో బాగున్న ఎలిమెంట్స్‌ను కూడా నెగిటివ్‌గా చూపిస్తూ నెగిటివ్ రివ్యూ ఇచ్చారు.
also read:Namitha:మహిళల నిబంధనలపై.. నమిత షాకింగ్ కామెంట్స్..!
“దర్శకుడి కష్టం తెలియకుండా విమర్శలు చేయడం సరికాదు” :
దీంతో సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తన మనసులోని బాధను బయటపెట్టారు. ఒక దర్శకుడు కథను తెరపైకి తీసుకురావడానికి ఎంత కష్టపడతాడు అనేది తెలియక చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. అది సరికాదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇంకొంచెం అడుగు ముందుకేసి ఆయన డైరెక్ట్‌గా సవాల్ కూడా విసిరారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది.
‘స్పిరిట్’ను టార్గెట్ చేయండి అంటూ సవాల్ :
మనందరికీ తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమాను మధ్యలోకి లాగుతూ ప్రణయ్ రెడ్డి వంగా క్రిటిక్స్‌కు ఘాటుగా సవాల్ విసిరారు. “దమ్ముంటే క్రిటిక్స్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాను అటాక్ చేయండి. మీరు ప్రొడక్షన్‌లోకి వస్తే ఆ డైరెక్టర్ కష్టం ఏంటో తెలుస్తుంది. కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు. చేతనైతే దమ్మున్నోళ్లు ‘స్పిరిట్’ను అటాక్ చేయండి. మూవీ రిలీజ్ అయ్యాక చూసుకుందాం” అంటూ ఘాటుగా సవాల్ విసిరారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో:
ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చాలామంది సందీప్ రెడ్డి వంగా బ్రదర్ ప్రణయ్ రెడ్డి వంగా ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం అంత హెడ్ వెయిట్ పనికిరాదు అంటూ నెగిటివ్‌గా స్పందిస్తున్నారు.
చూడాలి మరి.. ‘రోమాంచకం’ సినిమాను ఎవరైతే టార్గెట్ చేసి నెగిటివ్ రివ్యూలు ఇచ్చారో.. అలాంటి వాళ్లు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాకు ఎలాంటి రివ్యూ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ‘స్పిరిట్’ సినిమా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది.




