Sunday, September 13, 2026
HomeLATESTBigg Boss 10 Nagarjuna:నో సీక్రెట్ రూమ్.. రిస్క్ లో 11 మంది కంటెస్టెంట్స్.. అలసత్వం...

Bigg Boss 10 Nagarjuna:నో సీక్రెట్ రూమ్.. రిస్క్ లో 11 మంది కంటెస్టెంట్స్.. అలసత్వం వస్తే ఇంటికే – నాగార్జున

Bigg Boss 10 Nagarjuna: చైత్ర చరణ్ ఎలిమినేషన్ పై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు 11 మంది రిస్క్ లో ఉన్నారని తెలిపారు.

on
- Advertisement -banner Ad

Bigg Boss 10 Nagarjuna:సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ఒక ఎత్తైతే .. శని , ఆదివారాలలో స్ట్రీమింగ్ అయ్యే షో మరో ఎత్తు . ముఖ్యంగా వారం మొత్తంలో కంటెస్టెంట్స్ ఏం చేశారు అనే విషయాలను ఈ రెండు రోజుల్లో హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో స్పందిస్తూ తప్పుచేసిన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఆటలతో, పాటలతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఇక బిగ్ బాస్ సీజన్ 10(Bigg Boss 10 Nagarjun) ప్రారంభమై అప్పుడే వారం అయింది . ఈ సందర్భంగా శని, ఆదివారాల కోసం ఎదురుచూసిన ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మేరకు నాగార్జున శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అసలు విషయం చెప్పేశారు.

నో సీక్రెట్ రూమ్.. ఆ ఇద్దరు నేరుగా ఇంటికే..

బిగ్ బాస్ సీజన్ 10 అలా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే మొదటి వారమే ఎవరు ఊహించని విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఏకంగా ఇద్దరిని హౌస్ నుంచి పంపించేశారు. ఇదంతా ఉత్తిదే అని , వీళ్ళిద్దరిని సీక్రెట్ రూమ్ లో ఉంచి .. వీళ్లకు ఆట గురించి చెప్పి ఆ తర్వాత మళ్లీ హౌస్ లోకి పంపిస్తారని ఒకవైపు కామెంట్స్ రాగా.. మరొకవైపు వీరిద్దరికి మళ్ళీ పోటీ పెట్టి గెలిచిన వారిని హౌస్ లో ఉంచి, ఓడిన వారిని వీకెండ్ లో ఇంటికి పంపించేస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ చేశారు .

- Advertisement -
Advertisement

also read:Adarsha kutumbam:వెంకటేష్ ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్..!

చైత్ర, చరణ్ ఎలిమినేషన్ పై నాగార్జున క్లారిటీ..

అయితే ఇదే విషయంపై హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ.. మొదటి వారమే చైత్ర, చరణ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఆ ఇద్దరిని సీక్రెట్ రూమ్ లో ఉంచారని మీరందరూ అనుకుంటున్నారు కదా అని మిగతా కంటెస్టెంట్స్ ని అడగగా రాంప్రసాద్ , నరేష్ అవును అనే సమాధానం ఇచ్చారు. అయితే వారితో నేరుగా లైవ్ వీడియోలో మాట్లాడిన నాగార్జున.. చరణ్ , చైత్ర ల చేతే వారు సీక్రెట్ రూమ్ లో కాదు ఇంట్లో ఉన్నామని చెప్పించారు. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 10 ఎవరి ఊహకు అందని సరికొత్త గేమ్ షో అని అప్పుడే నిరూపించుకోవడం మొదలుపెట్టింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Ravi Teja:ఇరుముడి సక్సెస్ తో భారీగా రెమ్యూనరేషన్ పెంచిన రవితేజ..!

16 మంది హౌస్ లోకి 11 మంది రిస్క్ జోన్ లో..

ఇదే విషయంపై నాగార్జున మాట్లాడుతూ.. అగ్నిపరీక్ష ద్వారా 6 మంది, 10 మంది సెలబ్రిటీలు నేరుగా హౌస్ లోకి అడుగుపెట్టారు. అలా మొత్తం హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే హౌస్ మేట్స్ అయ్యారు. ఇద్దరు ఈ వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. మిగతా 11 మంది రిస్క్ జోన్ లో పడ్డారు . ఇక ఈ 11 మందిలో హౌస్ లో ఉండేది ఎవరు ? హౌస్ నుంచి వెళ్ళిపోయేది ఎవరో తెలియాల్సి ఉంది. అంటూ సీజన్ పై అంచనాలు పెంచేశారు నాగార్జున.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you