Wednesday, September 16, 2026
HomeLATESTMahesh Babu :మహేష్ బాబు నెక్ట్స్ మూవీపై బిగ్ అప్డేట్.. నిజమైతే బాక్సాఫీస్ షేక్!

Mahesh Babu :మహేష్ బాబు నెక్ట్స్ మూవీపై బిగ్ అప్డేట్.. నిజమైతే బాక్సాఫీస్ షేక్!

Mahesh Babu :సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Mahesh Babu :సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ వినిపించడం అనేది సర్వసాధారణం. ఇది అందరికీ తెలిసిందే. బోలెడన్ని రూమర్స్ రోజు వినిపిస్తూనే ఉంటాయి. కానీ రూమర్స్ నిజమైతే బాగుండు అని అనుకునే న్యూసులు మాత్రం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని, సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. అది కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సూపర్ స్టార్ హీరో వార్త కావడంతో జనాలు ఈ వార్తని ఇంకా హైలైట్ చేస్తున్నారు.

రాజమౌళితో మహేష్ బాబు ‘వారణాసి’ :

మనందరికీ తెలిసిందే.. సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu )ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ‘వారణాసి’ సినిమాకి సంబంధించి ఏ న్యూస్ బయటకు వచ్చినా సరే ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయెక్ రోల్ గా కనిపించబోతున్నారు అని కొందరు, మహేష్ బాబు శ్రీరాముడిగా ఎలా కనిపించబోతున్నారు అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

అయితే రాజమౌళి మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి కీలకమైన అప్‌డేట్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏ సర్‌ప్రైజ్ అయినా సరే థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే అన్న విధంగా రాజమౌళి బిహేవ్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా కూడా చిన్న ఫోటో రిలీజ్ చేస్తే సరి పెట్టుకున్నారు. అంటే ఈ సినిమా కోసం రాజమౌళి ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు.

సంజయ్ లీలా భన్సాలీతో మహేష్ బాబు సినిమా? :

ఇలాంటి సందర్భంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అన్న న్యూస్ తెరపైకి వచ్చింది. మహేష్ బాబు, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇటీవలే ఓ ఫంక్షన్‌లో మీట్ అయ్యారు అని, సినిమా కోసం కూడా మాట్లాడుకున్నారు అని, త్వరలోనే దీనికి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ అటు టాలీవుడ్‌లో, ఇటు బాలీవుడ్‌లో బాగా ఓ న్యూస్ హల్‌చల్ చేస్తుంది.

- Advertisement -
Advertisement

also read:tv:టీవీలో అదిరిపోయే సినిమాల సందడి.. సెప్టెంబర్ 15న ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?

పీరియాడికల్ అండ్ హిస్టారికల్ మూవీ? :

సంజయ్ లీలా భన్సాలీ మహేష్ బాబును కలిసి ఒక గ్రాండ్ పీరియాడికల్ అండ్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఆల్రెడీ మహేష్ బాబుకు కథ కూడా వినిపించారట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ప్రచారం ఊపుఅందుకుంది. అయితే దీనిపై అటు మహేష్ బాబు, ఇటు సంజయ్ లీలా భన్సాలీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా ఈ వార్త మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది.

- Advertisement -
Advertisement

also read:OTT: ఈ వారం వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు!

నిజమైతే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే! :

ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం నో డౌట్.. బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ అయిన, క్రియేట్ అయిన రికార్డ్స్ అన్నీ బద్దలైపోతాయి అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో. అప్పటివరకు ఫ్యాన్స్‌కి కొంచెం క్యూరియాసిటీ, కొంచెం టెన్షన్ తప్పదు మరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you