OTT: ఈ వారం థియేటర్లలో పెద్ద హీరోల సినిమాల కంటే చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో ‘హనుమాన్ అంశ్’ (తెలుగు) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే హిందీలో మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి స్పందనను అందుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.
అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్మించిన హారర్ చిత్రం ‘418’, ‘కాగతం పడవలు’, ‘పిఠాపురంలో అలా మొదలైంది’, ‘మిస్సింగ్ మేఘన’ వంటి సినిమాలు కూడా ఈ వారంలో థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఓటీటీలో ‘ఇరుముడి’ స్పెషల్ :
థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకున్న ‘ఇరుముడి’ సినిమా ఓటీటీ (OTT)రిలీజ్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇంటి నుంచే సినిమాను చూసే అవకాశం లభించనుంది.
ఇక ‘లస్ట్ స్టోరీస్ 3’, ‘మొదటి రాత్రి’, ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’ వంటి డబ్బింగ్ కంటెంట్ కూడా ఈ వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.
also read:Rashmika:రష్మిక కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.. ఈసారి స్టార్ కాదు, లెజెండ్‌గా!
నెట్‌ఫ్లిక్స్‌లో వరుస రిలీజ్లు :
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం భారీగా కంటెంట్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 16న ‘ద డాల్’ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 17న ‘మాన్స్టర్: ద లిజీ బోర్డెన్ స్టోరీ’, ‘నాట్ ఏ స్ట్రేంజర్’, ‘ప్లాస్టిక్ బ్యూటీ’, ‘స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 సీజన్ 2’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సెప్టెంబర్ 18న ‘ఇరుముడి’, ‘లస్ట్ స్టోరీస్ 3’, ‘బెస్ట్ ఆఫ్ ద బెస్ట్’, ‘మొదటి రాత్రి’, ‘ద స్కాండల్’, జాకీర్ ఖాన్ స్టాండప్ షో ‘పాప యార్’ విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 19న ‘ఫ్లాయిడ్ మేవెదర్ vs మేనీ పక్వియావో’, 20న ‘స్టాప్! దట్! ట్రైన్!’ స్ట్రీమింగ్ కానున్నాయి.
also read:Chiranjeevi:మెగాస్టార్ విశ్వంభరకు..రూట్ క్లియర్..!
ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లోనూ కంటెంట్ :
అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 15న ‘ద ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’ రెంట్‌కు అందుబాటులోకి రాగా, 16న ‘నీగ్లే’, ‘వెయిటింగ్ హై’, 18న ‘రామ్ అండ్ లీలా’, ‘యూ ప్లస్ మీ: ఎగైనెస్ట్ ద వరల్డ్’ విడుదల కానున్నాయి.
జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 15న 78వ ఎమ్మీ అవార్డ్స్, 17న ‘లీ క్రోనిన్స్ ద మమ్మీ’, 18న ‘తుడక్కం’, 19న ‘మాబ్ ల్యాండ్ సీజన్ 2’ స్ట్రీమింగ్ కానున్నాయి. సన్ నెక్స్ట్లో ‘అంగీకారం’ సెప్టెంబర్ 18న, ఆపిల్ టీవీ ప్లస్‌లో ‘స్లో హార్సెస్ సీజన్ 6’ సెప్టెంబర్ 16న అందుబాటులోకి రానుంది.
మొత్తంగా ఈ వారం థియేటర్లతో పోలిస్తే ఓటీటీల్లోనే ఎక్కువ వెరైటీ కనిపించనుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కామెడీ షోలు, అవార్డు ఈవెంట్లతో ప్రేక్షకులకు ఈ వీకెండ్ మంచి వినోదం దక్కనుంది.




