Chiyaan Vikram:కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న చియాన్ విక్రమ్ తాజాగా నటిస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, వినాయక చవితి కానుకగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలంటూ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను రివీల్ చేశారు. ఒక వీడియో ద్వారా టైటిల్‌ను ఖరారు చేశారు. విక్రమ్ కెరీర్‌లో 63వ సినిమాగా తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ‘పవర్ హౌస్’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు.
ఆనంద్ శంకర్‌తో మరోసారి విక్రమ్ :
‘ఇరుముగన్’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమా తర్వాత విక్రమ్, దర్శకుడు ఆనంద్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, ‘పవర్ హౌస్’ అనే టైటిల్ కూడా సినిమాకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అంటూ రిలీజ్ అయిన వీడియో ఆధారంగా తెలుస్తుంది. విడుదలైన టైటిల్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆసక్తికరంగా మారిపోయింది.
సాదాసీదా క్యాటరర్‌గా విక్రమ్ :
ఇందులో విక్రమ్ ఒక సాదాసీదా వెడ్డింగ్ క్యాటరర్‌గా కనిపించబోతున్నాడు. తన కుటుంబంతో సరదాగా కనిపిస్తూనే మరోవైపు తనలోని డార్క్ అండ్ వైల్డ్ షేడ్స్ చూపించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. స్టోరేజ్ రూంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి కట్టేసి ఉండడం టీజర్‌కు హైలైట్‌గా మారిందని చెప్పవచ్చు.
also read:Mahesh Babu :మహేష్ బాబు నెక్ట్స్ మూవీపై బిగ్ అప్డేట్.. నిజమైతే బాక్సాఫీస్ షేక్!
‘అపరిచితుడు’ తరహా విక్రమ్‌ను చూడబోతున్నామా? :
మొత్తానికి ‘అపరిచితుడు’ సినిమా తర్వాత అలాంటి విక్రమ్‌ను(Chiyaan Vikram) చూడాలి అనుకునే వాళ్లకు ఈ ‘పవర్ హౌస్’ సినిమా పర్ఫెక్ట్ అనే విధంగా ఉండబోతుంది అంటూ చిన్న అనౌన్స్‌మెంట్‌తోనే క్యూరియాసిటీ పెంచేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో ఊర్వశి, అదేవిధంగా గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉండడం సినిమాకు మరొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
also read:tv:టీవీలో అదిరిపోయే సినిమాల సందడి.. సెప్టెంబర్ 15న ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?
2027లో థియేటర్లలోకి పవర్ హౌస్ :
సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఈ టైటిల్ ప్రోమోను బట్టి సినిమాను 2027లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తేలిపోయింది. త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారికంగా వెల్లడించనున్నాం అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
టాలీవుడ్‌లోనూ విక్రమ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ :
చియాన్ విక్రమ్‌కు కేవలం కోలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇప్పటికీ ‘అపరిచితుడు’ సినిమా టీవీలో వచ్చినప్పుడు అతుక్కుపోయి సినిమా చూస్తారు జనాలు అంటే దానికి కారణం కచ్చితంగా విక్రమ్ నటనే. అలాంటి విక్రమ్ ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఫిల్మ్‌తో రాబోతున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో క్యూరియాసిటీని పెంచేస్తోంది.




