Wednesday, September 16, 2026
HomeLATESTSuriya:20 ఏళ్ల ప్రేమకు మరోసారి కొత్త ప్రమాణాలు.. సూర్య–జ్యోతిక స్పెషల్ వెడ్డింగ్!

Suriya:20 ఏళ్ల ప్రేమకు మరోసారి కొత్త ప్రమాణాలు.. సూర్య–జ్యోతిక స్పెషల్ వెడ్డింగ్!

Suriya:హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక చర్చిలో మరోసారి పెళ్లి చేసుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Suriya:సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక పెళ్లి చేసుకున్న వీడియో బాగా ట్రెండ్ అవుతోంది. పెళ్లికి సంబంధించిన పిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పొలిటికల్ పోస్టులు సాధారణంగా ఇలాంటి సమయంలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటివి కూడా కాకుండా సూర్య, జ్యోతికల పెళ్లి ఫొటోలు మరొకసారి వైరల్‌గా మారాయి.

మరోసారి పెళ్లి చేసుకున్న సూర్య–జ్యోతిక :

దక్షిణాది సినిమా పరిశ్రమలోనే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు సంపాదించుకున్న సూర్య(Suriya), జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈసారి క్రిస్టియన్ పద్ధతిలో వాళ్లు చర్చిలో కుటుంబ సభ్యుల సమక్షంలో, పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా ఈసారి వాళ్ల పిల్లల సమక్షంలో పెళ్లి చేసుకోవడం ఇంకా ఇంకా హైలైట్‌గా మారిపోయింది.

- Advertisement -
Advertisement

20 ఏళ్ల క్రితం మొదలైన ప్రేమ :

20 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా తమ దాంపత్య బంధాన్ని కొనసాగిస్తున్న ఈ లవబుల్ కపుల్ 1999లో ‘పూవెల్లం కేట్టుప్పార్’ అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి బంధానికి దారితీసింది.

ఇరు పెద్దల ఆశీర్వాదంతో 2006లో సెప్టెంబర్ 11న పెళ్లి పీటలు ఎక్కారు ఈ జంట. అయితే తమ పెళ్లి 20 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మరోసారి క్రిస్టియన్ పద్ధతిలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్టు ఒక వీడియోను రిలీజ్ చేశారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Nidhhi Agarwal: పట్టుచీరలో పుత్తడి బొమ్మల ఆకట్టుకుంటున్న నిధి అగర్వాల్!

చర్చిలో ప్రేమ ప్రమాణాలు :

ఆ వీడియో చాలా చాలా క్యూట్‌గా ఉంది. ముఖ్యంగా సూర్య చాలా యంగ్ లుక్‌లో కనిపించగా, హీరోయిన్ జ్యోతిక కూడా చాలా ఆకర్షణీయంగా కనిపించింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితుల సమక్షంలో చర్చిలో మళ్లీ ప్రేమ ప్రమాణాలు చేసుకున్నారు.

- Advertisement -
Advertisement

ఈ స్పెషల్ ఈవెంట్ కోసం తెలుపు రంగు దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయ్యారు హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక. పెళ్లి వేడుకలో భాగంగా జ్యోతిక చర్చిలో అడుగుపెడుతున్న సమయంలో సూర్య బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త ప్రమాణాలు చేసుకున్న అనంతరం సూర్య, జ్యోతికలపై అందరూ పూల వర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ALSO READ:TV:బుధవారం టీవీలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదిగో!

జ్యోతిక ఎమోషనల్ పోస్ట్ :

అనంతరం వీరు దిగిన కొన్ని ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి చాలా చాలా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని జ్యోతిక సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

త్యాగాలు, నిస్వార్థంగా ప్రేమించుకోవడం, సర్దుబాటులో ఒకరి కోసం ఒకరు ఇచ్చుకునే గౌరవం, రెండు దశాబ్దాల ప్రేమ, గొడవలు, గిల్లికజ్జాలు గుర్తుగా మా వాగ్దానాలను మరోసారి పునరుద్ధరించుకుంటున్నాం. మనం ప్రేమించే వ్యక్తి తన కంటే ఎక్కువగా మనల్ని గౌరవించినప్పుడు జీవితం కచ్చితంగా ఒక మంచి బహుమతిగా మారుతుంది. నా పిల్లలకు సరైన తల్లిగా ఉంటాను. సూర్యతో నాకున్న స్నేహాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను. ఆయనతో రాబోయే మరి 20 ఏళ్ల ప్రయాణానికి నేను రెడీగా ఉన్నాను అంటూ సూర్యపై తనకున్న ప్రేమను ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది హీరోయిన్ జ్యోతిక.

 

View this post on Instagram

 

A post shared by Jyotika (@jyotika)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you