Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్లో రోజురోజుకూ కంటెస్టెంట్ల మధ్య బాండింగ్, గొడవలు, సరదా సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. కొత్త లవ్ ట్రాక్ లు, సరదా గొడవలు, అల్లరి మాటలు..బిగ్ బాస్ సీజన్ 10 చూసేందుకు ఇంట్రెస్ట్ తెప్పిస్తున్నాయనే చెప్పాలి. మంగళవారం ప్రసారమైన 10వ ఎపిసోడ్లో నామినేషన్స్ సమయంలో జరిగిన హీట్ డిస్కషన్స్‌కు సంబంధించి త్రిగుణ్ ప్యాచ్ వర్క్ మొదలుపెట్టాడు. అయితే ఈ ఎపిసోడ్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో అంశం దేబ్జానీ–ముఖేష్ మధ్య జరిగిన సరదా సంభాషణ.
ముఖేష్‌పై దేబ్జానీ మరోసారి ఇష్టం వ్యక్తం :
వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ముందే ముఖేష్‌పై తనకు ఇష్టం ఉందని దేబ్జానీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ముఖేష్‌తో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టింది. తాను బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి అతనంటే ఇష్టం ఉందని చెప్పింది. దీనికి ముఖేష్ సరదాగా స్పందిస్తూ.. వచ్చినందుకు మాత్రమే ఇష్టమా? వచ్చిన తర్వాత ఇష్టం లేదా? అంటూ ఆటపట్టించాడు.
వర్షిణి విషయంలో మొదలైన సరదా వాగ్వాదం :
ఇంతలో వర్షిణి, ముఖేష్ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడిపి వాష్‌రూమ్ దగ్గరకు వచ్చారు. అక్కడ దేబ్జానీ కనిపించడంతో ముఖేష్ ఆమెను పిలవబోయి వర్షిణి అని అనడంతో సరదా సీన్ మొదలైంది. దేబ్జానీ కూడా వెంటనే స్పందిస్తూ.. తనను వర్షిణిలా కనిపిస్తున్నానా అంటూ నవ్వుతూ ప్రశ్నించింది.
ఆ తర్వాత వర్షిణితో పూల్‌లో ఉండటంపై దేబ్జానీ ముఖేష్‌ను ఆటపట్టించింది. అమ్మాయితో కలిసి పూల్‌లో ఉండటం ఏమిటని ప్రశ్నించగా, అక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారని ముఖేష్ వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ దేబ్జానీ మాత్రం వర్షిణి ఒక్కరే తనకు కనిపిస్తోందంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చింది.
ALSO READ:Rajamouli:రాజమౌళి బ్లూప్రింట్ రూల్స్ బ్రేక్ చేసిన హీరో ఇతడే..!
రామ్ ప్రసాద్ ఎంట్రీతో మరింత ఫన్ :
వీరి సంభాషణ మధ్యలో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో పంచ్ వేశాడు. ముఖేష్ తన చెల్లికి అన్యాయం చేస్తున్నాడంటూ సరదాగా కామెంట్ చేశాడు. దీంతో దేబ్జానీ కూడా ముఖేష్ తనకు అన్యాయం చేస్తున్నాడని నవ్వుతూ చెప్పింది. మరోవైపు వర్షిణి మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఆమెకు త్రిగుణ్ లాయర్‌గా వ్యవహరిస్తున్నాడా? అంటూ దేబ్జానీ సరదాగా కౌంటర్ ఇచ్చింది.
ALSO READ:Suriya:20 ఏళ్ల ప్రేమకు మరోసారి కొత్త ప్రమాణాలు.. సూర్య–జ్యోతిక స్పెషల్ వెడ్డింగ్!
కొత్త కంటెస్టెంట్లు వస్తే అసలు కథ మొదలవుతుందా? :
తనను ముఖేష్ పట్టించుకోకపోతే కొత్తగా కంటెస్టెంట్లు వచ్చినప్పుడు తాను కూడా ఇతరులతో పూల్‌లో ఉంటానని దేబ్జానీ సరదాగా హెచ్చరించింది. ఆ తర్వాత నరేష్‌ను ఉద్దేశించి అతను తన భర్త కాదని, తన బిడ్డ అంటూ నవ్వించింది.
మొత్తానికి దేబ్జానీ, ముఖేష్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ క్యూట్ కెమిస్ట్రీ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.




