Thursday, September 17, 2026
HomeLATESTTV:గురువారం బుల్లితెరపై..టీవీ సినిమాలు!

TV:గురువారం బుల్లితెరపై..టీవీ సినిమాలు!

TV:సెప్టెంబర్ 17 గురువారం తెలుగు టీవీ ఛానెళ్లలో అలరించనున్న సినిమాల పూర్తి జాబితా ఇదే.

on
- Advertisement -banner Ad

TV:సెప్టెంబర్ 17, గురువారం.. బుల్లితెర ప్రేక్షకులకు తెలుగు టీవీ ఛానెళ్లు విభిన్నమైన సినిమాలతో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా, క్లాసిక్ చిత్రాలు ఇలా పలు జానర్ల సినిమాలు నేటి టెలికాస్ట్(TV) షెడ్యూల్‌లో ఉన్నాయి. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే సినిమా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇవి మంచి ఆప్షన్లుగా నిలవనున్నాయి.

డీడీ యాదగిరి, ఈటీవీ ఛానెళ్లలో :

డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ డబ్ మూవీ ‘గ్రీడీ పీపుల్’, మధ్యాహ్నం 2 గంటలకు ‘తారకరాముడు’ ప్రసారం కానున్నాయి. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘అక్క మొగుడు’ టెలికాస్ట్ అవుతుంది. ఈటీవీలో ఉదయం 9 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ‘అల్లరి రాముడు’ ప్రసారం కానుంది.

- Advertisement -
Advertisement

ఈటీవీ సినిమా, జెమిని లైఫ్ :

ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘బంగారు కాపురం’, 10 గంటలకు ‘బాబు’, మధ్యాహ్నం 1 గంటకు ‘శుభమస్తు’, సాయంత్రం 4 గంటలకు ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’, రాత్రి 7 గంటలకు ‘దేవుడు చేసిన మనుషులు’, రాత్రి 10 గంటలకు ‘ఇద్దరు దొంగలు’ ప్రసారం కానున్నాయి. అర్ధరాత్రి 1 గంటకు ‘బంగారు కాపురం’ మరోసారి టెలికాస్ట్ అవుతుంది. జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘పెళ్లి పుస్తకం’, సాయంత్రం 4.30 గంటలకు ‘గుప్పెడు మనసు’ ఉన్నాయి.

ALSO READ:Actress Ambika:త్రిష -విజయ్ పై నటి అంబిక షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -
Advertisement

జెమిని టీవీ, జెమిని మూవీస్ :

జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘రెబల్’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘ఆక్సిజన్’ ప్రసారం కానున్నాయి. జెమిని మూవీస్‌లో ‘చరణదాసి’, ‘ఆలీబాబా అద్భుత దీపం’, ‘త్రినేత్రుడు’, ‘సెల్యూట్’, ‘అల్లుడు అదుర్స్’, ‘జంప్ జిలానీ’, ‘జయం’, ‘ఒకే మాట’ వంటి సినిమాలు వివిధ సమయాల్లో అలరించనున్నాయి.

ALSO READ:Yash Toxic OTT: ఓటీటిలోకి వస్తున్న టాక్సిక్ .. ఎప్పుడంటే..?

- Advertisement -
Advertisement

జీ తెలుగు, జీ సినిమాలు :

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు ‘గోరింటాకు’, సాయంత్రం 5 గంటలకు ‘మిస్టర్ నూకయ్య’ ప్రసారం కానున్నాయి. జీ సినిమాల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ‘చినబాబు’, ‘ఒంటరి’, ‘భగీరథ’, ‘గీతా గోవిందం’, ‘మై డియర్ భూతం’, ‘గేమ్ ఛేంజర్’, ‘సర్దార్’ వంటి చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి.

స్టార్ మా, స్టార్ మా మూవీస్ :

స్టార్ మాలో ఉదయం 1.30 గంటలకు ‘ఆహా’, 4 గంటలకు ‘తొలిప్రేమ’, 9 గంటలకు ‘జనక అయితే గనక’, రాత్రి 11 గంటలకు ‘భద్రకాళి’ ప్రసారం కానున్నాయి. స్టార్ మా మూవీస్‌లో ‘ప్రసన్నవదనం’, ‘అమ్మోరుతల్లి’, ‘90ML’, ‘రాజారాణి’, ‘మృత్యుంజయ్’, ‘S/O సత్యమూర్తి’, ‘ఛత్రపతి’ వంటి సినిమాలు ఉన్నాయి.

స్టార్ మా గోల్డ్‌లో :

స్టార్ మా గోల్డ్‌లో ‘పుణ్యదంపతులు’, ‘డాలర్ డ్రీమ్స్’, ‘శ్రీ సీతారాములకల్యాణం చూతము రారండి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆడవాళ్లే అలిగితే’, ‘లైగర్’, ‘విక్రాంత్ రోనా’ వంటి సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ఇలా గురువారం రోజు తెలుగు టీవీ ఛానెళ్లలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా సినిమాల సందడి కొనసాగనుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you