Roja:టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రోజా. విక్టరీ వెంకటేష్‌తో మాత్రం పెద్దగా సినిమాలు చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్ ఎక్కువగా కొనసాగకపోవడానికి కారణమేంటో రోజా గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. రోజా చెప్పిన వివరాల ప్రకారం.. వెంకటేష్, రోజా(Roja) భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి మధ్య ఓ సినిమా విషయంలో జరిగిన పరిణామం ఇద్దరి కాంబినేషన్‌పై ప్రభావం చూపిందట. సెల్వమణి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా ప్రారంభించేందుకు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయట.
అయితే తమిళంలో విజయకాంత్ నటించిన ఓ చిత్రం విజయం సాధించడంతో, అదే కథను వెంకటేష్, విజయశాంతి కాంబినేషన్లో రీమేక్ చేయాలని నిర్మాత నిర్ణయించినట్లు రోజా తెలిపారు. ఈ విషయం దర్శకుడికి ముందుగా తెలియకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారని చెప్పారు. సెల్వమణి బాధపడటాన్ని చూసిన రోజా కూడా ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తనకు, వెంకటేష్‌కు మధ్య కొంత దూరం ఏర్పడిందని వివరించారు.
‘పోకిరి రాజా’ షూటింగ్లో మరో ఘటన :
‘పోకిరి రాజా’ చిత్రీకరణ సమయంలో జరిగిన మరో సంఘటన కూడా పరిస్థితులను మరింత క్లిష్టం చేసిందని రోజా తెలిపారు. మైసూర్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ పాట రీల్ దెబ్బతినడంతో దాన్ని మరోసారి చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే అక్టోబర్ 22న సెల్వమణి పుట్టినరోజు కావడంతో, అక్టోబర్ 21 నాటికి హైదరాబాద్ చేరుకోవాలని రోజా ముందుగానే ప్రొడక్షన్ టీమ్‌కు చెప్పారట.
అయితే షూటింగ్ షెడ్యూల్లో మార్పులు జరగడంతో ఆమెకు అసౌకర్యం కలిగిందని, చివరకు ప్రొడక్షన్ టీమ్‌కు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌కు వెళ్లిపోయానని రోజా చెప్పుకొచ్చారు.
ALSO READ:BIGG BOSS:కెప్టెన్సీ టాస్క్‌లో సత్తా చాటిన ఝాన్సీ.. బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే!
కమ్యూనికేషన్ గ్యాప్‌తో పెరిగిన దూరం :
ఈ ఘటనను యూనిట్ సభ్యులు వెంకటేష్‌కు మరో విధంగా వివరించి ఉండొచ్చని రోజా అభిప్రాయపడ్డారు. తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వెంకటేష్‌కు నేరుగా వివరించకపోవడంతో అపార్థం కొనసాగిందని తెలిపారు. ఆ తర్వాత వెంకటేష్ సినిమాల్లో తనకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పారు. ‘రాజా’ సినిమాలో తనకు రావాల్సిన పాత్ర సౌందర్యకు దక్కిందని, తమిళంలో అదే తరహా పాత్రకు తనకు అవార్డులు కూడా వచ్చాయని రోజా గుర్తుచేసుకున్నారు.
ALSO READ:Agadha OTT:ఆత్మలు.. క్షుద్రశక్తి.. భయంకరమైన మిస్టరీ.. ఓటీటీలోకి ‘అగధ’!
వెంకటేష్‌పై ఎలాంటి ద్వేషం లేదన్న రోజా :
అయితే తనకు, వెంకటేష్‌కు మధ్య వ్యక్తిగత శత్రుత్వం లేదని రోజా స్పష్టం చేశారు. ఎదురైనప్పుడల్లా ఆయన ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పారు. తాను మంత్రి అయిన తర్వాత ఒకసారి విమానంలో కలిసినప్పుడు వెంకటేష్ “యు డిజర్వ్ ఇట్” అంటూ అభినందించారని తెలిపారు. తమ కాంబినేషన్ ఎక్కువగా కొనసాగకపోవడానికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని రోజా పేర్కొన్నారు.




