Shruti Haasan:టాలీవుడ్ , కోలీవుడ్ లో హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ శృతిహాసన్. ఈమె ఎవరో కాదు సీనియర్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన కమలహాసన్ కుమార్తె కూడా. శృతిహాసన్ ఎలాంటి విషయాలనైనా సరే మొహమాటం లేకుండా బోల్డుగా మాట్లాడేస్తుంది. ముఖ్యంగా చాలామంది మాట్లాడడానికి ఇబ్బంది పడే విషయమే పీరియడ్స్. నెలసరి నొప్పి, హార్మోన్ల మార్పుల వల్ల మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ విషయం గురించి తాజాగా శృతిహాసన్ ఓపెన్ గానే మాట్లాడేసింది.
మగవాళ్ళు కూడా పీరియడ్స్ రావాలి..
ఈ సందర్భంగా శృతిహాసన్ (Shruti Haasan)మాట్లాడుతూ .. మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని తాను దేవుడిని కోరుకుంటున్నానని చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే నటి సోహా అలీ ఖాన్ తో ఒక టాక్ షోలో పాల్గొంది. అందులో శృతిహాసన్ పీరియడ్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. నెలసరి సమయంలో కొంతమంది మహిళలు ఎదుర్కొనే తీవ్రమైన నొప్పి, అసౌకర్యం గురించి మాట్లాడుతూ.. ఆ బాధలు మగవాళ్లు కూడా ఒకసారి అనుభవిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చింది. మగవాళ్లకు కూడా ఇలాంటివి నెలకి ఒకసారి రావాలని తాను దేవుడిని కోరుకుంటున్నాను ” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.
ALSO READ:Roja:వెంకటేష్ తో అందుకే సినిమాలు చేయలేదు..ఇన్నాళ్లకి అసలు విషయం చెప్పిన రోజా..!
పీరియడ్స్ లీవ్ పై కొత్త చర్చ..
అలా జరిగితే షూటింగ్ కాంట్రాక్టులలో పీరియడ్స్ లీవ్ వంటి అంశాల పైన ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతుందంటూ వ్యాఖ్యానించింది శృతిహాసన్. అయితే ఈ వ్యాఖ్యల పైన నటి సోహ అలీ ఖాన్ కూడా తనదైన స్టైల్ లో స్పందించారు.. మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే ఎవరికి ఎంత బ్లీడింగ్ అయింది.. ఎవరి టాంపస్ సైజు పెద్దది అనే విషయంలో కూడా పోటీపడే అవకాశం ఉంటుంది అంటూ చాలా ఫన్నీగా చమత్కరించింది. అలా వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలోనే కెరియర్ ప్రారంభంలో షూటింగ్ సెట్ లో ఎదురైన అనుభవాల గురించి కూడా శృతిహాసన్ తెలిపింది.
ALSO READ:BIGG BOSS:కెప్టెన్సీ టాస్క్‌లో సత్తా చాటిన ఝాన్సీ.. బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే!
హీరోలకి ఒక న్యాయం.. హీరోయిన్లకు మరో న్యాయం..
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో పీరియడ్ క్రాంప్స్ గురించి మాట్లాడడానికి చాలా భయపడేదాన్ని.. ఆ సమయంలో తన ఎనర్జీ ఎందుకు తగ్గింది? తాను ఎందుకు మామూలుగా కనిపించడం లేదు? అనే విషయాన్ని అక్కడ ఉన్న కొంతమంది అర్థం చేసుకోలేకపోయారంటూ తెలిపారు. ఒకసారి తన కోస్టార్ మోకాలికి సర్జరీ జరిగినప్పుడు ఆయనకు ఇబ్బంది లేకుండా షూటింగ్ జరగడానికి టీం కొన్ని రూల్స్ నే మార్చేసిందని, అదే సమయంలో తాను కూడా తీవ్రమైన పీరియడ్ నొప్పులతో ఇబ్బంది పడ్డాను. ఆ విషయాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదనే విషయాన్ని గుర్తించాను అంటూ తెలిపింది. అయితే ఒక దర్శకుడికి కూతురు ఉంది . అయితే తన పరిస్థితి గురించి చెప్పడంతో ఆయన అర్థం చేసుకొని మరి షూటింగ్ ని అడ్జస్ట్ చేశారని తెలిపింది. మొత్తానికి శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




