Friday, September 18, 2026
HomeLATESTRaaka movie: రాకా సినిమా అప్డేట్.. ఆసక్తి పెంచేస్తున్న కొత్త పోస్టర్..

Raaka movie: రాకా సినిమా అప్డేట్.. ఆసక్తి పెంచేస్తున్న కొత్త పోస్టర్..

Raaka movie: అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా మూవీ నుండి విడుదల చేసిన ఒక పోస్టర్ అనుమానాలతో పాటు అంచనాలు పెంచేస్తోంది.

on
- Advertisement -banner Ad

Raaka movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం రాకా. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో సరికొత్త గెటప్తో కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కూడా సినిమాపై అంచనాలను పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దీంతో ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే క్షణాలలో వైరల్ గా మారుతోంది . సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రాకా మూవీ నుండి సరికొత్త అప్డేట్..

తాజాగా ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్ని విడుదల చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ఇతర వివరాలు ఇవ్వకుండా కేవలం 37 అనే నెంబర్ తో ఒక మిస్టరీ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులలో సినీవర్గాలలో మరింత ఉత్కంఠతను రేపేలా చేస్తోంది. అసలు 37 సంఖ్య అర్థమేంటి అనే విషయం పైన రకరకాల ఊహాగానాలు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:YouTuber Vaishnavi:నడిరోడ్డుపై యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య..!

ఏంటీ 37?

సెప్టెంబర్ 21న డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు కావడం , ఈ 37 నెంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అనే విషయం ఆ రోజున బయటపడే అవకాశం ఉందంటూ అల్లు అర్జున్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్, దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అల్లు అర్జున్ ఇందులో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. అలాగే పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ ప్రాజెక్టులో కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Tollywood:సినిమాలో హీరో హీరోయిన్ పెళ్లి సీన్.. నిజంగానే మూడు ముళ్లు వేస్తారా?

అంచనాలు పెంచేసిన లేటెస్ట్ అప్డేట్..

మరి ఈ 37 మిస్టరీ నెంబర్ తో సినిమా పైన అంచనాలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. జవాన్ సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాకా చిత్రంలో దీపికా పదుకొనేతోపాటు జాన్వీ కపూర్, మృణాల్ , రష్మిక తదితర సెలబ్రిటీలు కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. చివరిగా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో భారీ పాపులారిటీ అందుకోవడమే కాకుండా సరికొత్త రికార్డులను సృష్టించారు. మరి రాకా(Raaka movie) సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగ రాస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you