Friday, September 18, 2026
HomeLATESTTollywood:సినిమాలో హీరో హీరోయిన్ పెళ్లి సీన్.. నిజంగానే మూడు ముళ్లు వేస్తారా?

Tollywood:సినిమాలో హీరో హీరోయిన్ పెళ్లి సీన్.. నిజంగానే మూడు ముళ్లు వేస్తారా?

Tollywood:తెరపై చూపించే ఈ పెళ్లి సీన్లలో నిజంగానే మూడు ముళ్లు వేస్తారా? లేక వాటిని కేవలం నటనగానే చిత్రీకరిస్తారా? అసలు సినిమా షూటింగ్‌లో పెళ్లి సన్నివేశాలను ఎలా తెరకెక్కిస్తారో తెలుసుకుందాం.

on
- Advertisement -banner Ad

Tollywood:ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అంటే కచ్చితంగా ఆ సినిమాలో నటించే నటీనటులు నటించకూడదు.. జీవించేయాలి. డైరెక్టర్ ఒక సీన్ చెప్పినప్పుడు హీరోయిన్ కానీ, హీరో కానీ.. “అమ్మమ్మో.. ఈ సీనులో మేము నటించం. ఇలా నటిస్తే మా ఇమేజ్ డామేజ్ అవుతుంది. లేకపోతే మా ఎమోషన్స్ దెబ్బతింటాయి” అనే విధంగా మాట్లాడితే కచ్చితంగా డైరెక్టర్ రాసుకున్న కథ వేస్ట్ అయిపోతుంది. ఒక డైరెక్టర్ సినిమా(Tollywood) కోసం ఎంత కష్టపడతాడో, ఒక హీరో, హీరోయిన్ కూడా అంతే కష్టపడాలి. అప్పుడే ఆ సినిమా సక్సెస్ అవుతుంది.

అలా నటించే హీరో, హీరోయిన్లు బోలెడు మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక సినిమాని తెరపై చూసినప్పుడు జనాలు ఆ పాత్రలో తమను తాము ఊహించుకుంటూ ఉంటారు. కొందరైతే ఏకంగా సినిమా చూసి ఏడ్చేస్తారు. అంత ఎమోషనల్‌గా ఆ సీన్స్‌ను తెరకెక్కిస్తారు డైరెక్టర్లు.

- Advertisement -
Advertisement

సినిమా సీన్స్ నిజంగానే చేస్తారా? :

చాలామందికి సినిమా చూసేటప్పుడు ఒక సందేహం రావచ్చు. ఈ సినిమాలో జరిగే సీన్స్ నిజంగానే తెరకెక్కిస్తారా? ఒక హీరో, హీరోయిన్ ముద్దు పెట్టుకున్నప్పుడు నిజంగానే ముద్దు పెట్టుకుంటారా? నిజంగానే తాకుతారా? ఒక హీరో వీళ్లను కొట్టేటప్పుడు నిజంగానే విలన్ కొడతారా? దెబ్బలు తగులుతాయా? నీళ్లల్లో తోసేస్తారా? ఇలాంటి సందేహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

మరీ ముఖ్యంగా తాళి కట్టే సన్నివేశం అప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నిజంగానే హీరో హీరోయిన్ మెడలో తాళి కట్టారా? ఆ హీరోకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా? వాళ్ల భార్య ఏమనుకోదా? హిందూ సాంప్రదాయం ప్రకారం ఇలాంటివి తప్పు కాదా? అంటూ రకరకాలుగా చర్చించుకుంటూ ఉంటారు.

- Advertisement -
Advertisement

తాళి కట్టే సీన్‌లో హీరో, హీరోయిన్ పాత్రలోనే ఉంటారు

అయితే సినిమాలో హీరో హీరోయిన్‌కి తాళి కట్టే విధానం పూర్తిగా ఒక పాత్రకి మనం కమిట్మెంట్ ఇచ్చాము అంటే, ఆ పాత్ర ఎలాంటిదైనా సరే మనం తలంచి చేయాల్సిందే. మరీ ముఖ్యంగా సినిమాలో తాళి కట్టే సీన్స్ అప్పుడు హీరో, హీరోయిన్ పూర్తిగా పాత్రలో మాత్రమే లీనమై ఉంటారు. వాళ్ల ఒరిజినల్ క్యారెక్టర్‌కి అసలు సంబంధమే ఉండదు.

ఆ హీరోకి పెళ్లయినా, ఆ హీరోయిన్‌కి పెళ్లయి పిల్లలు ఉన్నా.. పూర్తిగా వాళ్లు వాళ్ల క్యారెక్టర్‌లోనే లీనమైపోతారు. చాలామంది పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోలు సినిమా కోసం మళ్లీ హీరోయిన్ల మెడలో తాళి కడుతూ ఉంటారు.

- Advertisement -
Advertisement

also read:OTT Movies:ఒక్కరోజే 20 ఓటీటీ రిలీజ్‌లు.. ఈ వీకెండ్ మిస్ అవ్వకండి!

నిజంగానే మూడు ముళ్లు వేయరు :

ఇవి చూసినప్పుడు జనాలు కొంచెం విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు. “పెళ్లయిన హీరో, ఇద్దరు పిల్లలు ఉన్న హీరో మళ్లీ ఏంది మెడలో తాళి కట్టడం?” అంటూ రకరకాలుగా కౌంటర్స్ వేస్తారు.

కానీ పూర్తిగా అది సినిమాలో చూపించే విధంగా నిజంగానే వాళ్లు తాళి కట్టరు. వెనకాల అలా చేయి పట్టుకుని ఉన్నట్లు ఉంటారు. మూడు ముళ్లు కూడా వేయరు. ఆ పెళ్లి సెట్ అంతా.. పక్కన కూర్చున్న పంతులు కూడా డమ్మీ. చదివే మంత్రాలన్నీ హిందూ సంప్రదాయం ప్రకారం చేసే విధంగా ఎవ్వరూ కూడా సినిమాలో పెళ్లి తంతును నిర్వహించరు.

కేవలం ఆర్ట్ అండ్ డిజైన్ కోసం మాత్రమే అలాంటి సెట్స్ వేసి హీరో, హీరోయిన్ పెళ్లి సీన్లు చిత్రీకరించే విధంగా ఉంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం, కాళ్లకు మెట్టెలు పెట్టడం, బిందెలో ఉంగరాలు ఆడించే ఆటలు.. అన్నీ కూడా ఏదీ సంప్రదాయంగా జరగదు. టేకుల మీద టేకులు తీసుకుని చేస్తూ ఉంటారు.

also read:Vishal:షూటింగ్‌లో విశాల్‌కు గాయాలు.. అసలేం జరిగిందంటే?

షూటింగ్ పూర్తయ్యాక తాళిని తీసేస్తారు :

ఒక నటికి లేదా నటుడికి ఇలాంటివి చాలా కామన్. చాలామంది సందేహ పడుతూ ఉంటారు. హీరో హీరోయిన్ మెడలో తాళి కట్టాక దానిని ఏం చేస్తారో అని..? హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కసారి ఆ మహిళ మెడలో తాళి పడ్డాక తాళిని తీయకూడదు.

కానీ హీరోయిన్ అలా కాదు. హీరో తాళి కట్టగానే షాట్ ఓకే అయిపోగానే ఆ దారిని తీసి చక్కగా ఆర్ట్ వాళ్లకి ఇచ్చేసి కారు ఎక్కి వెళ్లిపోతుంది. సినిమా పెళ్లిలో ఇవన్నీ కామన్. కాబట్టి ఎవరికీ అది నిజమైన పెళ్లి కాదు. వాళ్లకి ఆ ఫీలింగ్ రాదు.

సినిమాని సినిమాగానే చూడాలి :

సినిమాని సినిమాగానే చూడాలి అని చాలామంది డైరెక్టర్లు, మేకర్స్, సినీనటులు కూడా చెప్పుకొస్తూ ఉంటారు. కానీ ఇది తెలియక కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వాళ్ల ఇమేజ్‌కి, వాళ్ల ఏజ్‌కి, వాళ్లు చేసే సీన్స్‌ని కంపేర్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ మారుతుందో!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you