Fauzi: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా పాన్ ఇండియా చిత్రాలు వరుసగా రాబోతున్నాయి. ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామా చిత్రంగా రాబోతున్న చిత్రం ఫౌజీ. ఈ చిత్రాన్ని హనురాఘవపూడి దర్శకత్వం వహించగా డిసెంబర్ మూడవ తేదీన ఈ సినిమా రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ఏడాది ఫాజీ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా బ్యాలెన్స్ వర్క్ కారణంగా ఈ సినిమా డిసెంబర్ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.
ఫౌజీ మూవీ వాయిదా పడనుందా?
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి రెండు భారీ యాక్షన్ సీన్స్ పెండింగ్లో ఉన్నాయని , వీటికి కనీసం 40 రోజులపాటు ప్రభాస్ కాల్ షీట్స్ అవసరమని వినిపిస్తున్నాయి . దీనితో పాటు కొంత ప్యాచ్ వర్క్ కూడా మిగిలి ఉండడంతో మొత్తం మీద కలుపుకొని 50 రోజుల వరకు ఇంకా షూటింగ్ అవసరం ఉందట. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫౌజి(Fauzi) సినిమా డిసెంబర్ మూడవ తేదీన రిలీజ్ కష్టమనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విధంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ALSO READ:Hatah teaser:సరికొత్తగా హతః టీజర్.. చూశారా..?
అభిమానులు ధీమా..
అయితే ఇవన్నీ కూడా ఫౌజీ సినిమా పైన కేవలం ఊహాగానాలు మాత్రమే , ఇంకా చిత్ర బృందం ఈ విషయాల పైన అఫీషియల్ గా ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ మాత్రం ముందుగా ప్రకటించిన తేదీకి ఫౌజీ సినిమాని తీసుకువస్తారని ధీమాతో కనిపిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వి నటిస్తోంది. అలాగే మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద , భానుచందర్ తదితర నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.
ALSO READ:Shruti Haasan:పీరియడ్స్ మగవాళ్ళకు రావాలి.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!
ప్రభాస్ తదుపరి చిత్రాలు..
ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు షూటింగ్ అయిపోయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 సినిమా షూటింగ్లో ఎంట్రీ ఇవ్వానున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ 2 సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజా సాబ్ 2 సినిమా కూడా మొదలవుతుందో లేదో చూడాలి మరి. మొత్తానికి ప్రభాస్ మాత్రం ప్రస్తుతం తన చేతిలో ఉన్న చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది.




