Monday, September 21, 2026
HomeLATESTKajal Aggarwal:దాని వల్లే భార్యాభర్తల మధ్య దూరం.. విడాకులపై కాజల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు

Kajal Aggarwal:దాని వల్లే భార్యాభర్తల మధ్య దూరం.. విడాకులపై కాజల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు

Kajal Aggarwal:భార్యాభర్తల మధ్య విడాకులకు దారితీసే అంశాలపై నటి కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

on
- Advertisement -banner Ad

Kajal Aggarwal:ఈ మధ్యకాలంలో ఏ స్టార్ సెలబ్రిటీ చూసినా విడాకులు తీసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అది టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, కోలీవుడ్ కాదు.. పక్క భాష ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ నటీనటులు కూడా తమ వైవాహిక జీవితాన్ని నిలుపుకోలేక విడాకులు తీసుకుంటూ, సోషల్ మీడియా వేదికగా తాము ఎందుకు విడాకులు తీసుకుంటున్నామనే విషయాన్ని చెబుతున్నారు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రిటీలు, పాన్ ఇండియా స్టార్స్ కూడా విడాకులు తీసుకుని అభిమానులను షాక్‌కు గురి చేశారు. అయితే ఇలా విడాకులు తీసుకోవడానికి కారణం ఒకే ఒక్కటి అంటూ కాజల్ అగర్వాల్ ఓపెన్‌గా స్పందించారు. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

కాజల్ అగర్వాల్ ఏమన్నారంటే..:

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)గురించి అందరికీ తెలిసిందే. నటనకు నటన, అందానికి అందం.. ఆమె నటించే ప్రతి సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమా కథ ఫ్లాప్ అయినా మాత్రం మంచి మార్కులు పడుతూ ఉంటాయి.

సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్.. ఎందుకు భార్యాభర్తలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు అనేదానికి రీజన్స్ కూడా చెప్పింది. మరీ ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడమే అంటూ కొండబద్దలు కొట్టేసింది.

- Advertisement -
Advertisement

కమ్యూనికేషన్ లేకపోవడమే ప్రధాన కారణం:

సోషల్ మీడియా అడిక్షన్ ఎక్కువగా ఉండడం, స్మార్ట్‌ఫోన్ల మితిమీరిన వాడకం, ఎక్కువగా రీల్స్ చూస్తూ ఉండడం, ఒకరికి ఒకరు టైం ఇచ్చుకోకపోవడం వల్లే వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

కమ్యూనికేషన్ లోపించడమే ప్రధాన కారణంగా కాజల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో దంపతుల మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ లేదని, అందరూ ఫోన్లలోనే బిజీగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss 10:బిగ్ బాస్ -10 రెండవ వారం ఎలిమినేషన్ కృష్ణుడేనా..?

డిన్నర్ డేట్‌కు వెళ్లినా ఫోన్లలోనే బిజీ:

ఒకవేళ టైం స్పెండింగ్ కోసం డిన్నర్ డేట్స్‌కు వెళ్లినా ఎవరి ఫోన్లో వాళ్లు బిజీగా గడుపుతూ ఉంటే.. అసలు ఇక డిన్నర్ డేట్‌కు వెళ్లడం దేనికి? అంటూ ప్రశ్నించారు.

సహనం, వినే ఓపిక రెండూ కూడా ఈ మధ్యకాలంలో భార్యాభర్తలకు ఎక్కువగా నశించిపోయాయని, అందుకే వాళ్ల మధ్య కమ్యూనికేషన్ తగ్గి, మనస్పర్థలు పెరిగి, విడాకులు తీసుకునే స్థాయికి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.

also read:Chiranjeevi:హైదరాబాదులో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

భర్త గౌతమ్ కిచ్లుతో రిలేషన్‌షిప్ గురించి..:

ఇక తన భర్త గౌతమ్ కిచ్లుతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఆమె మాట్లాడుతూ.. “మేము మా వర్క్స్‌లో బిజీగా ఉంటాము. కానీ ఖచ్చితంగా వారానికి ఒక్కరోజైనా మేమిద్దరం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం. ఫోన్లు వాడకుండా మేమిద్దరమే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మనసు హాయిగా ఉంటుంది. మనస్పర్థలు రాకుండా ఉంటాయి.

అనుబంధానికి ఫోన్లు కాకుండా మనసు విప్పి మాట్లాడుకోవడమే నిజమైన పిల్లర్” అంటూ నేటి యువతకు సూచించారు కాజల్.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you