Rashmika Mysaa: టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతోంది. కమర్షియల్ చిత్రాలతోనే కాకుండా విభిన్నమైన కథలతో తనలోని నటనను బయటికి తీస్తోంది రష్మిక. ఈ క్రమంలోనే రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మైసా. ఈ చిత్రం రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ పైన ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. చిత్ర బృందం నవంబర్ 27న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.
ఆకట్టుకుంటున్న మైసా టీజర్..
ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఆదివారం రోజున టీజర్ ని సాయంత్రం విడుదల చేసింది. మైసాలో రష్మిక(Rashmika Mysaa) ఇంతకుముందు ఎన్నడు కనిపించని రీతిలో కనిపిస్తోంది. ముఖ్యంగా గిరిజన గొండు మహిళా పాత్రలో అద్భుతంగా ఆకట్టుకుంది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు రష్మిక విశ్వరూపం టీజర్ లో చూపించేసింది. ముఖ్యంగా తన తండ్రి కోసం తన వాళ్లకోసం పోరాడే మహిళగా రష్మిక పాత్ర అద్భుతంగా టీజర్ లో ఆకట్టుకుంది. కష్ట కాలంలో తన ప్రజల కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథ అన్నట్లుగా కనిపిస్తోంది.
also read:Kajal Aggarwal:దాని వల్లే భార్యాభర్తల మధ్య దూరం.. విడాకులపై కాజల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు
అదరగొట్టేసిన రష్మిక..
టీజర్ అధ్యంతం యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా రష్మిక యాక్టింగ్ టీజర్ కే హైలెట్గా నిలిచింది. అలాగే అడవులు గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే విజువల్స్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి. రష్మిక పాత్రలోని మాస్ షేర్స్ యాక్షన్ సీన్స్ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసేలా కనిపిస్తున్నాయి. అలాగే జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్ కూడా హైలెట్గా నిలిచింది. యాక్షన్ సీన్స్ తగ్గట్టుగా మ్యూజిక్ టీజర్ కి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా సినిమా కథకు తగ్గట్టుగానే డైరెక్టర్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
also read:Bigg Boss 10:బిగ్ బాస్ -10 రెండవ వారం ఎలిమినేషన్ కృష్ణుడేనా..?
నవంబర్ 27న రిలీజ్..
మైసా సినిమా కొత్త తరహా విభిన్నమైన కథాంశంతో రాబోతోంది. రష్మిక కెరియర్ లోని మరో డిఫరెంట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుంది. టీజర్ తోని సినిమా అంచనాలు పెంచేసిన చిత్ర బృందం మరి ట్రైలర్తో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. సినిమా నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర కూడా హైలెట్ గా ఉండేలా కనిపిస్తోంది. ఇవే కాకుండా రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇటీవలే రష్మిక గాయం తరువాత వరుసగా సినిమా షూటింగ్లలో పాల్గొంటుంది..




