The Paradise : నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో సెప్టెంబర్ 24 ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ది ప్యారడైజ్. నానికి జోడిగా కయాదు లోహర్ నటించగా, విలన్ గా మోహన్ బాబు నటించారు. మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలైన తర్వాత నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. అయినప్పటికీ కూడా ది ప్యారడైజ్ సినిమా ఇండియాలో మొదటి రోజు ఇప్పటివరకు రూ. 34.65 కోట్ల రూపాయల నెట్ వసూలు సాధించినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్స్ ఫైనల్ కాకపోవడంతో మొదటి రోజు పూర్తి అయ్యేసరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్..
నాని నటించిన గత చిత్రాలు దసరా, హిట్ 3 సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని ది ప్యారడైజ్(The Paradise collections) సినిమా దాటేసినట్టు సమాచారం. తొలి రోజు దసరా సినిమా రూ.23.20 కోట్ల రూపాయలు వసూలు సాధించగా, హిట్ 3 కేవలం మొదటి రోజు రూ .21 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ది ప్యారడైజ్ సినిమా ఓపెనింగ్స్ నాని కెరియర్ లోని ఒక బెంచ్ మార్కుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ది ప్యారడైజ్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక రెస్పాన్స్ లభించింది. తెలుగు వెర్షన్ ద్వారా రూ. 25 కోట్ల రూపాయల నెట్ వసూల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
also read:Vijay Deverakonda:విజయ- రష్మిక సోషల్ మీడియా ప్రేమ..!
విభిన్నమైన గెటప్ లో నాని..
ఇక హిందీలో రూ .1.82 కోట్లు , తమిళంలో కోటి రూపాయలు నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దసరా సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. భారీ స్థాయిలో రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో నాని చాలా పూర్తి విభిన్నమైన గెటప్ లో కనిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు భిన్నంగా నటించారు. కానీ రొటీన్ కథ కావడం చేత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ది ప్యారడైజ్ సినిమాతో మొదటి రోజు కలెక్షన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.
also read:The Paradise: ది ప్యారడైజ్ సినిమాలో ఆ సీన్స్ పై వివాదం..!
అసలైన పరీక్ష నేడే..
ది ప్యారడైజ్ సినిమాని ట్రైలర్ విడుదల చేయకుండానే డైరెక్ట్ గా థియేటర్లో విడుదల చేసింది చిత్రబృందం. సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వైరల్ గా మారుతున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మొదటి రోజు బాగానే రాబట్టినట్లు వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల విజువల్ మేకింగ్, నాని నెవర్ బిఫోర్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్ పై ప్రశంసలు కురిపించారు. ప్రీమియం టికెట్లు కూడా రేట్లు భారీగా పెరగడంతో కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అసలు పరీక్ష శుక్రవారం నుంచే మొదలవుతుంది . ముఖ్యంగా నెగిటివ్ టాక్ వచ్చిందంటే కచ్చితంగా సినిమా కలెక్షన్స్ పైన చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాని తదుపరి సినిమాల విషయానికి వస్తే.. బ్లడీ రోమియో చిత్రంతోపాటుగా హిట్ 4 సినిమాలలో నటించబోతున్నారు




