Film industry:సినిమాలో అత్యధిక రెమ్యూనరేషన్ ఎవరు తీసుకుంటున్నారు, ఆస్తి ఎవరికి ఎక్కువ ఉంది అనే విషయంపై నటీనటులకు సంబంధించి ఇలా ఏదో ఒక విషయం ఎప్పుడు వైరల్‌గా మారుతూనే ఉంటుంది. అలా బాలీవుడ్లో (Film industry)అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో షారుక్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో హీరోగా అలరిస్తున్న షారుఖ్ ఖాన్ సంపాదనలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ప్రొడక్షన్, బ్రాండ్ అంబాసిడర్, ఇతర బిజినెస్ ల ద్వారా భారీగానే ఆస్తిని సంపాదిస్తున్నారు.
తగ్గిన షారుక్ ఖాన్ ఆస్తుల విలువ..
అయితే ఈ ఏడాది షారుక్ ఖాన్ నికర ఆస్తి సంపద విలువ భారీగా తగ్గిపోయినట్లు వినిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఆయనే సినీ సెలబ్రిటీల ఆస్తుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు సమాచారం. హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్ 2026 నివేదిక తాజాగా విడుదల చేయగా దీని ప్రకారం షారుఖ్ ఖాన్ సంపద గత ఏడాది పోలిస్తే ఏడాది చాలా తగ్గిందని సంచారం. షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ గత ఏడాది రూ. 12,490 కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం రూ. 10,000 కోట్ల రూపాయలు ఉన్నట్లు అంచనా వేశారు. అంటే సుమారుగా 2490 కోట్ల రూపాయలు కోల్పోయారు.
also read:Chiranjeevi :చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై షాకింగ్ ఆరోపణలు..ల్యాబ్ టెక్నీషియన్ సంచలన కామెంట్స్!
సెలబ్రిటీస్ ఆస్తుల వివరాలు..
షారుఖ్ ఖాన్ ముఖ్యంగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, అలాగే కోల్కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ వంటి వాటిలో వ్యాపారాలు పెట్టడమే కాకుండా ఇతర వాటిల్లలో వాటాలను కూడా పరిగణలోకి తీసుకొని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ వ్యాల్యూషన్ లో మార్పుల కారణాల వల్ల ఈ తగ్గుదల వచ్చినట్లు తెలిపారు. షారుక్ ఖాన్ ఆస్తిలో అన్ని వేల కోట్లు తగ్గినప్పటికీ.. ఇండియాలో అత్యంత ధనవంతులైన జాబితాలో షారుక్ ఖాన్ మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. అమితాబచ్చన్ ఆస్తి 4,000 కోట్లు, సల్మాన్ ఖాన్ ఆస్తి 3000 కోట్లు, హృతిక్ రోషన్ ఆస్తి 2500 కోట్ల తో తర్వాతి స్థానాలలో నిలిచారు.
also read:The Paradise : ది ప్యారడైజ్ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?
దేశంలో అత్యంత ధనవంతుడు ఆయనే..
దేశంలోనే అత్యంత ధనవంతుడు స్థానాన్ని మాత్రం గౌతం ఆదాని ఫ్యామిలీకే దక్కింది . అంబానీ ఫ్యామిలీ రెండవ స్థానంలో ఉన్నారు . ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా డిసెంబర్ 24, 2026న ప్రేక్షకుల ముందుకి క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా భారీగా హైప్ పెంచేసింది. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవేళ కింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం ఈ సినిమాతో తన రెమ్యూనరేషన్ బ్రాండ్ వాల్యూ కూడా మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ చివరిగా 2023లో డంకి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ మూడేళ్లకి కింగ్ సినిమాతో రాబోతున్నారు.




