Saturday, September 26, 2026
HomeLATESTRenu Desai:గణపతి నిమజ్జనాలపై రేణూ దేశాయ్ మరోసారి ఫైర్..!

Renu Desai:గణపతి నిమజ్జనాలపై రేణూ దేశాయ్ మరోసారి ఫైర్..!

Renu Desai:గణపతి నిమజ్జనాల సందర్భంగా డీజేలు, భారీ శబ్దాలు, మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడంపై నటి రేణూ దేశాయ్ మరోసారి స్పందించారు.

on
- Advertisement -banner Ad

Renu Desai:గణపతి నిమజ్జనాల సందర్భంగా నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వినాయక చవితి వేడుకల్లో డీజేలు ఏర్పాటు చేసి అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలు చేయడం, నిమజ్జన కార్యక్రమాల సమయంలో మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు, ట్రోల్స్ చేశారు.

దీంతో రేణూ దేశాయ్(Renu Desai) ఓ వీడియోను షేర్ చేసి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. తాను హిందూ ధర్మానికి లేదా వినాయక చవితి వేడుకలకు వ్యతిరేకం కాదని ఆమె తెలిపారు. పండుగలను భక్తిశ్రద్ధలతో, ఇతరులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. తాజాగా మరోసారి నిమజ్జనాల అంశాన్ని ప్రస్తావిస్తూ రేణూ దేశాయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె తాజా వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

- Advertisement -
Advertisement

‘నేను హిందువులను టార్గెట్ చేయడం లేదు’ :

ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. హిందువులను టార్గెట్ చేస్తున్నానంటూ తనపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తనకు సనాతన ధర్మంపై ఎంతో విశ్వాసం ఉందని, రాముడు, శివుడిని భక్తితో పూజిస్తానని చెప్పారు. తనకు తెలిసిన ధర్మం, తన పండుగల గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని, ఇతర మతాల ఆచారాలు, గ్రంథాల గురించి పూర్తిగా తెలియకపోవడంతో వాటిపై వ్యాఖ్యానించే హక్కు తనకు లేదని పేర్కొన్నారు.

also read:Actor Krishnudu :కృష్ణుడు అసలు బ్యాక్‌గ్రౌండ్ ఇదేనా? రాజభవనాన్ని తలపించే ఆ ఇల్లు చూశారా?

- Advertisement -
Advertisement

సూర్యాస్తమయం లోపే నిమజ్జనం చేయాలని.. :

చిన్నతనం నుంచి తన కుటుంబంలో వినాయకుడి నిమజ్జనం విషయంలో కొన్ని నియమాలను పాటించేవారని రేణూ దేశాయ్ గుర్తుచేసుకున్నారు. సాయంత్రం ఆరు గంటలలోపే నిమజ్జనం పూర్తి చేయాలని తన తల్లి చెప్పేవారని తెలిపారు. చిన్నప్పుడు మధ్యాహ్నం మూడు, మూడున్నర గంటల నుంచే సూర్యాస్తమయం లోపు కార్యక్రమాన్ని ముగించేందుకు తొందర పెట్టేవారని చెప్పారు. పగటి సమయంలోనే శుభకార్యాలు పూర్తి చేయాలనే ఆచారం తమ ఇంట్లో ఉండేదని వివరించారు.

also read:Hema:హేమ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?

- Advertisement -
Advertisement

‘ఇందులో భక్తి ఎక్కడుంది?’ :

ప్రస్తుతం కొన్ని నిమజ్జన కార్యక్రమాల్లో డీజేలు, భారీ శబ్దాలు, డప్పులతో హడావుడి చేయడం, మద్యం సేవించి గణపతి విగ్రహాల ముందు నృత్యాలు చేయడంపై రేణూ దేశాయ్ ప్రశ్నలు సంధించారు. ఇలాంటి ప్రవర్తనలో భక్తి ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

పెద్దలు, పిల్లలకు ఇబ్బంది కలిగించొద్దు :

ఇళ్లలో ఉన్న వృద్ధులు, అమ్మమ్మలు, తాతలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, చిన్నపిల్లలు భారీ శబ్దాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా పండుగలను నిర్వహించడం సరికాదని అన్నారు. దేవుడి పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో మనమే నియమాలు పాటించకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని సూచించారు. తన వ్యాఖ్యలను హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చూడొద్దని మరోసారి స్పష్టం చేశారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you