Saturday, September 26, 2026
HomeLATESTDhanush:ధనుష్- వడివేలు మధ్య విభేదాలు?

Dhanush:ధనుష్- వడివేలు మధ్య విభేదాలు?

Dhanush: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో ధనుష్ కి వడివేలుతో విభేదాలు అన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Dhanush:కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన ధనుష్ ప్రస్తుతం తన 56వ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మధురైలో చాలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లో ప్రముఖ లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. తనదైన కామెడీ టైమింగ్ తో అలరించిన వడివేలు ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఎందుకు ఇంత సమయం పట్టిందనే విషయం పైన వడివేలు స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

ధనుష్ తో నటించకపోవడంపై వడివేలు క్లారిటీ..

వడివేలు మాట్లాడుతూ.. చాలా సుదీర్ఘ విరామం తర్వాత తాను ధనుష్ (Dhanush)తో కలిసి పనిచేసే అవకాశం లభించింది . మా ఇద్దరి కలయికకు ఇంత గ్యాప్ రావడానికి కారణం ఒక మూడవ వ్యక్తి.. ఆ వ్యక్తి సృష్టించిన కొన్ని అపోహలవల్లే మా ఇద్దరి మధ్య ఇన్నాళ్లు గొడవలు జరిగాయి.. అది కూడా మిస్ అండర్ స్టాండింగ్ వల్లే జరిగాయని తెలిపారు. ఆ మూడో వ్యక్తి ఎవరు అనే విషయం ఇప్పుడు కోలీవుడ్ సినీ పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారింది.. మధురై లో మారనాడు పురప్పన స్వామి ఆలయంలో అభిమానుల మధ్య ఈ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.

- Advertisement -
Advertisement

also read:Keerthy Suresh:డోరతీ మూవీ చూసి షాకైన నెటిజన్లు.. ఆ సీన్లపై సోషల్ మీడియాలో దుమారం!

18 అడుగుల కొడవలిని సమర్పించిన ధనుష్..

ఈ సందర్భంగా ధనుష్ ఏకంగా 18 అడుగుల భారీ కొడవలి ని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ చిత్రం పక్కా విలేజ్ రూటెడ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ డైరెక్టర్ పచ్చ ముత్తు దర్శకత్వంలో రాబోతోంది. ధనుష్ రాయన్ తర్వాత ఎస్జె సూర్య ఇందులో కీలకమైన పాత్రలు నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటిస్తోంది. విజయ్ కుమార్ ఇతర పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలోనే నిర్మిస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Renu Desai:గణపతి నిమజ్జనాలపై రేణూ దేశాయ్ మరోసారి ఫైర్..!

ధనుష్ తదుపరి చిత్రాలు..

ప్రముఖ సంగీత దర్శకుడు సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు . ఈ సినిమా 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ చిత్రాల విషయానికి వస్తే ప్రస్తుతం యాక్షన్ డ్రామా చిత్రం ఓం చాప్టర్ 1 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి , శ్రీలీల నటించడమే కాకుండా మమ్ముట్టి తదితర నటినటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా వాస్తవంగా అక్టోబర్ 16వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతోంది. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ధనుష్, వడివేలు మధ్య ఉన్న విభేదాలు పై వడివేలు క్లారిటీ ఇవ్వడంతో ధనుష్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇన్ని రోజులు ఈ విషయం చాలామందికి తెలియదు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you