Wednesday, September 30, 2026
HomeLATESTBigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10.. ఈ వారం నామినేషన్ లో 9...

Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10.. ఈ వారం నామినేషన్ లో 9 మంది కంటెస్టెంట్స్..!

Bigg Boss 10: బిగ్ బాస్ 10 లో నాల్గవ వారం నామినేషన్ లో భాగంగా 9 మంది నామినేట్ అయ్యారు. ఇక కెప్టెన్సీ టాస్క్ కూడా గట్టిగానే సాగుతోంది.

on
- Advertisement -banner Ad

Bigg Boss 10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆడియన్స్ అంచనాలకు అందకుండా చాలా రసవత్తంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ల విషయంలో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు కూడా ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ మొదటి వారంలో చైత్ర, రెండో వారం కృష్ణుడు ఎలిమినేట్ కాగా , మూడో వారం వంశీ లేదా వర్షిని ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ముఖేష్ వీళ్లిద్దరి కోసం తన కెప్టెన్సీ పదవిని త్యాగం చేసి ఎలిమినేషన్ నుంచి తప్పించారు.

నామినేషన్ లో 9 మంది సెలబ్రిటీస్..

సెప్టెంబర్ 7న మొదలైన ఈ బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10)ఇప్పటికే సక్సెస్ఫుల్గా మూడు వారాలను పూర్తిచేసుకుంది. ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగుపెట్టగా సోమవారం కాబట్టి ఎలిమినేషన్ కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ చాలా హోరాహోరీ గానే కొనసాగింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు .ముఖ్యంగా ఈ వారం నామినేషన్లు ఎక్కువగా మిథిలేష్ ఎలిమినేషన్ కి సహకరించిన అంశంపైనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా త్రిగుణ్, ముఖేష్, సృష్టిలను టార్గెట్ చేసుకొని చాలామంది నామినేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒకరి పైన ఒకరు పాయింట్స్ చెప్పి మరి కంటెస్టెంట్ ని నామినేషన్స్ కి వేశారు.

- Advertisement -
Advertisement

also read:Aishwarya Rai Bachchan:ఐశ్వర్య రాయ్ కి తప్పని బాడీ షేమింగ్..!

ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరు?

గతవారం కెప్టెన్సీ పదవిని వదులుకొని మరి ఇద్దరిని సేవ్ చేసి డైరెక్ట్ గా నామినేషన్ లోకి వచ్చారు ముకేశ్ ఆయనతో పాటు మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నాలుగవ వారం నామినేషన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బాస్ ప్రకటించారు. ఈవారం హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి అర్హత కలిగి ఉన్న వారిలో ముఖేష్, త్రిగుణ్, దేప్ జానీ, అమన్, రోహిణి శాలిని, నరేష్, చరణ్, సృష్టి ఉన్నట్టుగా బిగ్బాస్ ప్రకటించారు. ఈ లిస్టు ని ఒకసారి గమనిస్తే నామినేషన్ లో ఉన్న తొమ్మిది మంది కూడా అంతో ఇంతో కంటెంట్ ఇస్తున్న వారే. మరి వీరిలో హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:అక్టోబర్ 2న బరిలో ఐదు క్రేజీ చిత్రాలు..!

కెప్టెన్ అయ్యేది ఎవరు?

ఇప్పటికే ఇందుకు సంబంధించి ఆన్లైన్ ఓటింగ్ కూడా నమోదు అవుతోంది. తాజాగా బిగ్ బాస్ లో కెప్టెన్సీ పోరు మొదలవగా, రెడ్ , బ్లూ టీమ్స్ కి డ్రమ్స్ తీసుకొచ్చి కొన్ని రూల్స్ పెట్టి మరి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.. అయితే ఈ టాస్క్ లో కూడా రెండు టీమ్స్ మధ్య ఒకరినొకరు పడేయాలని గొడవపడ్డారు. ఈ క్రమంలోనే సృష్టికి గాయాలైనట్లుగా ప్రోమోలో చూపించారు. దీంతో నేడు కెప్టెన్సీ కోసం పోరు మంచి ఫైర్ లాగా కనిపిస్తోంది. మరి కెప్టెన్ ఎవరు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ బిగ్బాస్ పదో సీజన్ మాత్రం ఎవరు ఊహించని రీతిలో ముందుకు వెళుతుందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you