Friday, October 2, 2026
HomeLATESTSigma Movie Review : సిగ్మా మూవీ రివ్యూ.. జాసన్ సంజయ్ డైరెక్షన్ ఎలా ఉందంటే?

Sigma Movie Review : సిగ్మా మూవీ రివ్యూ.. జాసన్ సంజయ్ డైరెక్షన్ ఎలా ఉందంటే?

Sigma Movie Review :టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్

on
- Advertisement -banner Ad

Sigma Movie Review : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారీ స్కామ్‌ను ప్రధాన కథాంశంగా తీసుకుని రూపొందించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించారు. సీనియర్ నటుడు సంపత్ రాజ్ కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

రాజు సుందరం, అన్బుదాసన్, యోగ్ జేపీ, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్నింగ్ షోలు పడిన తర్వాత సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి సినిమాపై స్పందనలు మొదలయ్యాయి. మరి ‘సిగ్మా’ ఎలా ఉంది? జాసన్ సంజయ్ దర్శకుడిగా ఆకట్టుకున్నారా? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

- Advertisement -
Advertisement

కథ :

సుమారు రూ.500 కోట్ల భారీ ఆర్థిక స్కామ్ చుట్టూ ‘సిగ్మా’ కథ తిరుగుతుంది. ఈ భారీ మోసం వెనుక ఉన్న అసలు వ్యవహారం ఏంటి? అందులో హీరో పాత్రకు ఎలాంటి సంబంధం ఉంది? స్కామ్‌ను ఛేదించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనే అంశాలతో కథ ముందుకు సాగుతుంది.

దర్శకుడు యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కథలో భాగంగా మలిచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని సోషల్ మీడియా స్పందనలు చెబుతున్నాయి.

- Advertisement -
Advertisement

విశ్లేషణ :

‘సిగ్మా’కు తమిళనాడులో ఇప్పటివరకు వచ్చిన సోషల్ మీడియా స్పందన ఎక్కువగా పాజిటివ్‌గానే కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, జాసన్ సంజయ్ దర్శకత్వం, తమన్ సంగీతంపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఫస్టాఫ్ విషయంలో కొంత మిశ్రమ స్పందన కూడా కనిపిస్తోంది. కథ సెటప్ కారణంగా ప్రథమార్థం కాస్త నెమ్మదిగా అనిపించిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సెకండాఫ్‌లో యాక్షన్, కథనం వేగం పెరగడం సినిమాకు ప్లస్‌గా మారిందనే కామెంట్స్ వస్తున్నాయి.

దర్శకుడిగా తొలి సినిమానే అయినప్పటికీ జాసన్ సంజయ్ తన కథను యాక్షన్ థ్రిల్లర్ శైలిలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ప్రతి ఫ్రేమ్‌ను గ్రాండ్‌గా చూపించడంతో పాటు, కీలక సన్నివేశాల్లో టెక్నికల్ అంశాలను బలంగా ఉపయోగించినట్లు ప్రేక్షకుల స్పందనను బట్టి తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

సందీప్ కిషన్ :

సినిమాకు సందీప్ కిషన్ ప్రధాన బలం. యాక్షన్ సన్నివేశాల్లో తన ఎనర్జీతో ఆకట్టుకున్నారు. కథకు అనుగుణంగా పాత్రలో కనిపిస్తూ సినిమాను తన భుజాలపై నడిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌కు మంచి స్పందన వస్తోంది.

ఫరియా అబ్దుల్లా :

హీరోయిన్‌గా ఫరియా అబ్దుల్లా తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సందీప్ కిషన్‌తో ఆమె కెమిస్ట్రీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

సంపత్ రాజ్ :

పవర్‌ఫుల్ విలన్‌గా సంపత్ రాజ్ తన మార్క్ చూపించారు. సీరియస్ విలనిజంతో పాత్రకు బలం చేకూర్చారు.

ఇతర నటీనటులు :

రాజు సుందరం, అన్బుదాసన్, యోగ్ జేపీ, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శన్ తదితరులు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్ :

తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యమైన సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది.

దర్శకుడు జాసన్ సంజయ్ యాక్షన్ థ్రిల్లర్‌కు అవసరమైన గ్రాండ్ ట్రీట్‌మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. విజువల్స్, యాక్షన్ బ్లాక్స్, ఎడిటింగ్ వంటి అంశాలు సినిమాకు తగిన విధంగా ఉన్నాయి.

also read: Don’t Trouble the Trouble:”డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

ప్లస్ పాయింట్స్ :

* సందీప్ కిషన్ యాక్షన్
* ఆసక్తికరమైన స్కామ్ నేపథ్యం
* సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్
* జాసన్ సంజయ్ దర్శకత్వ ప్రయత్నం
* తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
* సంపత్ రాజ్ విలన్ పాత్ర

మైనస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా అనిపించడం
* కొన్ని చోట్ల కథనం మరింత వేగంగా ఉంటే బాగుండేది
* స్కామ్ కథాంశాన్ని మరింత లోతుగా చూపించే అవకాశం ఉంది

also read: Dorothy Movie:కీర్తి సురేష్ ‘డోరతీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

పంచ్ లైన్ :

స్కామ్ కథకు యాక్షన్ టచ్.. సందీప్ కిషన్ ఎనర్జీకి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే ‘సిగ్మా’ ఓకే యాక్షన్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది.

రేటింగ్ : 3/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you