Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన జైలర్ 2 సినిమా మరో పది రోజుల్లో థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, గతంలో విడుదలైన జైలర్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. జైలర్ సినిమా కథ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే జైలర్ 2 సినిమా కథ ప్రారంభమవుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.
జైలర్ 2 ట్రైలర్ రిలీజ్..
ఇందులో టైగర్ ముత్తువేల్ పాండియన్ భార్యగా రమ్యకృష్ణ నటించారు. కోడలిగా మిర్నా నటించారు. ఎస్ జె సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి ఇందులో కీలకమైన పాత్రలలో నటించగా.. మోహన్ లాల్, రాజ్ కుమార్, హృతిక్ రోషన్ తదితర నటీనటులు ఇందులో కేమియో పాత్రలు నటిస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా సంగీతాన్ని అనిరుధ్ అందించారు. రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ విషయానికి వస్తే.. ఈసారి అందరూ వరల్డ్ నుంచి వచ్చే ముప్పును ఎలా ఎదుర్కొంటారు అనే సినిమా అన్నట్లుగా కనిపిస్తోంది. తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు పూర్తిగా డ్రైవర్గా మారతాడు రిటైర్డ్ జైలర్ (రజనీకాంత్).
యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసిన రజినీకాంత్..
ఎప్పటిలాగే రజనీకాంత్ (Rajinikanth)జైలర్ 2 చిత్రంలో యాక్షన్ సీన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్ తో మరోసారి ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. అలాగే ఇందులో చెప్పే డైలాగులు కూడా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. రజినీకాంత్ ఈ సినిమా లో దాదాపుగా డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారు. రజనీకాంత్ కోసం విలన్లు వెతకడం రజనీకాంత్ సైలెంట్ గా తన పని చేసుకుంటూ ముందుకు సాగడం వంటివి ట్రైలర్లో కనిపిస్తున్నాయి. తెలియకుండా రజినీకాంత్ తన పనిని పూర్తి చేస్తున్నాడు అన్నట్లుగా ట్రైలర్ లో.చూపించారు.
సినిమాపై అంచనాలు పెంచేసిన ట్రైలర్..
ఇందులో స్టార్ హీరో మోహన్ లాల్, శివన్న ఇప్పటికే మొదటి పార్ట్ లో ఉండగా ఇప్పుడు రెండో పార్ట్ లో కూడా వారిని చూపించారు. దీన్ని బట్టి చూస్తే వీరికి ఇందులో పాత్రలు చాలా కీలకంగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే హృతిక్ రోషన్ పాత్ర కూడా ఉన్నట్లు చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కి హైలెట్గా నిలిచింది. మొత్తానికి తాజాగా విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు. మొదటి భాగం 240 కోట్ల రూపాయలతో తీయగా.. సుమారుగా 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు రెండవ భాగాన్ని 350 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే అక్టోబర్ 15వ తేదీ వరకు ఆగాల్సిందే.




