Monalisa:మహా కుంభమేళాలో వైరల్ గా మారిన మోనాలిసా భోంస్లే గడిచిన కొన్ని నెలల క్రితం ఎక్కువగా ఈమె పేరు వినిపించింది. అంతేకాకుండా ఈమెకు సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టాయి. దీంతో హీరోయిన్ అవుతుందనుకున్న సమయంలో మోనాలిసా ఒక ఊహించని విధంగా అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు మురికివాడలో ఉంటూ రుద్రాక్షలు అమ్ముకున్న ఈమె.. సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్ కి స్టార్డం సంపాదించింది. సినిమా అవకాశాలు రావడం ఆ తర్వాత ఫర్మాన్ ఖాన్ తో ప్రేమ, పెళ్లి చేసుకోవడం, లవ్ జిహాద్ వివాదాల మధ్య ఈమె కెరియర్ ఆగిపోయింది.
వివాదంలో చిక్కుకొని కనిపించకుండా పోయిన మోనాలిసా..
2025లో ఆ కుంభమేళలో రుద్రాక్షలు అమ్ముతున్న సమయంలో మోనాలిసా(Monalisa)కు సంబంధించి తీసిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి. ఆమె కళ్ళు, చిరునవ్వు చూసి జనం కూడా ఎగబడ్డారు.. అదే క్రేజీ తో ఆమె సినిమా ఆఫర్లు అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో హీరోయిన్ గా కూడా అవకాశం ఇచ్చారు. యాక్టింగ్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది ఫిబ్రవరి 2026 లో షూటింగ్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపించాయి. కానీ సినిమా విడుదల కాకుండానే ఆమె లైఫ్ లో ఒక పెద్ద మలుపు జరిగిందని చెప్పవచ్చు.
also read:Keerthy Suresh:రాధిక ఆప్టే వివాదంపై.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్..!
ఎన్నో రూమర్సు తెర పైకి..
మలయాళ సినీ ఇండస్ట్రీల నాగమ్మ అనే చిత్రానికి పూజా కార్యక్రమంలో పాల్గొనగా.. అక్కడ ఫర్మాన్ ఖాన్ పరిచయం కాగా ఆ చిత్రంలోని తాను విలన్ పాత్ర చేస్తున్నానని చెప్పగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.ఆ తర్వాత మార్చి 11, 2026న కేరళలో తిరువనంతపురం గుడిలో ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం మోనాలిసా తన కుటుంబ సభ్యుల నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. ఆ తర్వాత ఈమె మీద ఎన్నో రూమర్స్ కూడా వినిపించాయి.
also read:Anil Ravipudi:జనవరి 12 విడుదల ప్రమోషన్.. కీర్తి సురేష్ తో కృతి శెట్టి డాన్స్..!
మళ్లీ ఇన్నాళ్ళకి కనిపించిన మోనాలిసా..
అయితే తన భర్తతో వివాహం తర్వాత మోనాలిసా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా యూట్యూబ్, సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి కొన్ని వీడియోలను రీల్స్ చేస్తూ వైరల్ గా మారుతుంది. మరొకవైపు బాలీవుడ్లో ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా ఆగిపోయినట్లు వినిపిస్తోంది.. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సనోజ్ మిశ్రా తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మోనాలిసా కూడా ఆరోపణలు చేసింది. అలాగే మోనాలిసా నటించిన రెండు సౌత్ సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుగులో నటి కల్పలతతో కూడా కలిసి ఆమె ఒక వీడియోలో కనిపించింది. మొత్తానికి కుంభమేళ మోనాలిసా పేరు ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ వినిపించలేదు. ప్రస్తుతం కుంభమేళ మోనాలిసాకు సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారింది.




