Friday, November 20, 2026
HomeLATESTArjun Sarja:హీరో అర్జున్ సర్జా కూతురికి విడాకులా..?

Arjun Sarja:హీరో అర్జున్ సర్జా కూతురికి విడాకులా..?

Arjun Sarja: ప్రముఖ సినీనటుడు అర్జున్ సర్జ తన కూతురిపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై మండిపడ్డారు.

on
- Advertisement -banner Ad

Arjun Sarja:తెలుగు, తమిళ పరిశ్రమలో నటుడుగా, హీరోగా, విలన్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు యాక్షన్ కింగ్ హీరో అర్జున్ సర్జా.. ఇటీవల తన రెండవ కుమార్తెకు సైతం వివాహం చేయగా పెద్ద కుమార్తె , నటి ఐశ్వర్య అర్జున్ వివాహం కూడా గడిచిన కొద్ది నెలల క్రితం జరిగింది. అయితే తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితం పైన జరుగుతున్న అసత్య ప్రచారంపైన నటుడు అర్జున్ సర్జా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన కూతురు వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు.

ఐశ్వర్య అర్జున్ విడాకులు తీసుకోబోతున్నారా?

ఈ వ్యవహారం పైన హీరో అర్జున్ (Arjun Sarja)కూడా అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు.. తన చిన్న కుమార్తె అంజనా వివాహం కూడా చాలా గ్రాండ్గా చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకల తర్వాత ఐశ్వర్య అర్జున్ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టారు.. ఈ ఊహాగానాలు కాస్త శృతిమించడంతో ఒక తండ్రిగా అర్జున్ సీరియస్ కావడం జరిగింది. ఈ వివాదాస్పదం పైన అర్జున్ తప్పుడు రాతలు రాస్తున్న వారిపైన ఫైరయ్యారు. ఒక తండ్రిగా నా కూతురిని లక్ష్యంగా చేసుకొని ఆధారాలు లేని అవమానకరమైన ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను అని, నటులుగా మేము ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు ఊహాగానాలు సహజమే అయినప్పటికీ కానీ మా గురించి ఏది పడితే అది మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అంటూ హెచ్చరించారు.

- Advertisement -
Advertisement

also read:Monalisa:కుంభమేళ మోనాలిసా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

రూమర్స్ పై స్పందించిన అర్జున్..

పత్రికా రంగాన్ని తాము ఎంతో గౌరవిస్తామని, అయినా నిజానిజాలు విశ్వాసనీయత గురించి మాత్రం ఆలోచించకుండా ఇలాంటి ప్రచారం చేయడం చాలా బాధాకరమని, ఒక తండ్రిగా తన కూతురికి ఎప్పుడూ అండగా ఉంటానని, సమాజంలోని మహిళల పట్ల బాధ్యతగా ఉండాలంటూ కోరారు హీరో అర్జున్ సర్జా. ముఖ్యంగా కుటుంబం నుంచి మద్దతులేని మహిళల పైన ఇలాంటి దుష్ప్రచారాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని, ఇప్పటికే కష్టాలలో ఉన్న వారి జీవితాన్ని మరింత క్లిష్టతరం ఇలాంటి విషయాలు చేస్తాయని , ఏ మహిళకు కూడా ఇలాంటి పరిస్థితులు ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకూడదు అంటూ అర్జున్ ఆవేదనతో ఒక నోట్ రాశారు.

- Advertisement -
Advertisement

also read:Keerthy Suresh:రాధిక ఆప్టే వివాదంపై.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్..!

ఆ హక్కు మీకు లేదంటూ..

అర్జున్ సర్జా బ్లాస్ట్ అనే సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటిస్తున్న అర్జున్ విభిన్నమైన పాత్రలు చేయడంలో ముందున్నారు. ఈ ఏడాది సీత పయణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తన కూతురు మీద జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టడంతో అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you