Bigg Boss 10:ఇప్పుడు ఎక్కడ చూసిన సరే బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 29వ రోజు నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యులు తమ కారణాలను చెబుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా అపూర్వ, ముఖేష్ మధ్య జరిగిన మాటల యుద్ధం హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వీరితో పాటు త్రిగుణ్, వర్షిణి కూడా తమ వాదనలను గట్టిగానే వినిపించారు.
యాపిల్ టాస్క్‌తో నామినేషన్స్ :
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్(Bigg Boss 10) ప్రత్యేకమైన టాస్క్‌తో నిర్వహించారు. ఇద్దరు సభ్యుల్లో ఒకరు యాపిల్‌ను బాక్స్ కింద దాచాలి. అనంతరం మరో సభ్యుడు ఆ యాపిల్‌ను వెతికి పట్టుకోవాలి. యాపిల్‌ను ముందుగా దక్కించుకున్న సభ్యుడికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం కల్పించారు. యాపిల్ దక్కించుకోలేని సభ్యుడు మాత్రం ఒక్కరినే నామినేట్ చేయాల్సి ఉంటుంది.
త్రిగుణ్, అమన్‌కు రామ్ ప్రసాద్ నామినేషన్ :
రామ్ ప్రసాద్, ముఖేష్ మధ్య జరిగిన పోటీలో రామ్ ప్రసాద్ యాపిల్‌ను దక్కించుకున్నాడు. దీంతో ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం అతడికి లభించింది. ఈ క్రమంలో త్రిగుణ్, అమన్‌లను రామ్ ప్రసాద్ నామినేట్ చేశాడు. త్రిగుణ్ గేమ్‌లో అవసరానికి మించి అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నాడని తన కారణాన్ని వెల్లడించాడు.
‘డిజాస్టర్ కెప్టెన్’ అంటూ ముఖేష్ ఫైర్ :
ఆ తర్వాత ముఖేష్.. అపూర్వను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నామినేషన్ కారణాలను చెప్పే క్రమంలో ఇద్దరూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అపూర్వ కెప్టెన్‌గా ఉన్న సమయంలో పక్షపాతంగా వ్యవహరించిందని ముఖేష్ ఆరోపించాడు. అంతేకాకుండా ఆమెను ‘డిజాస్టర్ కెప్టెన్’ అంటూ విమర్శించాడు.
ముఖేష్ వ్యాఖ్యలకు అపూర్వ కూడా ఘాటుగా స్పందించింది. ముఖేష్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మరొకరు కెప్టెన్సీ చేసినట్లుగా వ్యవహరించారని ఆమె పరోక్షంగా వర్షిణిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దీంతో వర్షిణి కూడా అపూర్వతో వాగ్వాదానికి దిగింది.
also read:Rajinikanth:జైలర్ 2 ట్రైలర్ లో మాస్ డైలాగులతో ఆకట్టుకుంటున్న రజనీకాంత్..!
ట్రైయాంగిల్ లవ్ స్టోరీపై అపూర్వ ఆగ్రహం :
ముఖేష్ తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడాడని అపూర్వ ఆరోపించింది. తనను, రోహిత్‌ను ప్రస్తావిస్తూ ‘ట్రైయాంగిల్ లవ్ స్టోరీ’ అంటూ వ్యాఖ్యలు చేశాడని ఆమె మండిపడింది. వ్యక్తిగత విషయాలను నామినేషన్స్‌లోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
also read:Vijay Deverakonda:సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక పెద్ద వ్యవస్థ.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
లుక్స్‌పై కామెంట్స్.. త్రిగుణ్ సెటైర్ :
తర్వాత యాపిల్‌ను త్రిగుణ్ దక్కించుకున్నాడు. అతడికి కూడా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లభించింది. ఈ క్రమంలో అపూర్వను నామినేట్ చేసిన త్రిగుణ్.. గతంలో ఆమె తన లుక్స్‌పై వ్యాఖ్యలు చేసిందని చెప్పాడు. తన లుక్స్ గురించి ఆమె మాట్లాడటంతో, తాను కూడా ఆమె లుక్స్ గురించి మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చినట్టేనని సెటైరికల్‌గా వ్యాఖ్యానించాడు. దీంతో 29వ రోజు నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్ టాపిక్‌గా మారింది.




