Saturday, October 10, 2026
HomeLATESTJailer 2 :జైలర్ 2 టికెట్ ధరలు పెంపు.. ఏపీలో కొత్త రేట్లు ఇవే!

Jailer 2 :జైలర్ 2 టికెట్ ధరలు పెంపు.. ఏపీలో కొత్త రేట్లు ఇవే!

Jailer 2 :ఆంధ్రప్రదేశ్‌లో ‘జైలర్ 2’ టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించడంతో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

on
- Advertisement -banner Ad

Jailer 2 :సినిమా టికెట్ ధరల పెంపు అంశం మరోసారి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు కోరడం, ప్రభుత్వాలు అందుకు ఆమోదం తెలపడం కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే టికెట్ ధరలు పెంచకుండానే విడుదలైన కొన్ని సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో, ఈ విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ నిర్మాతలు మాత్రం టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలను ఆశ్రయిస్తుండటం చర్చకు దారితీస్తోంది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమాకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించినట్లు సమాచారం.

జైలర్ 2 టికెట్ రేట్ల పెంపునకు ఏపీ అనుమతి :

రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్ 2’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ప్రకారం సినిమా విడుదలైన అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించారు. దీంతో సినిమా విడుదలైన తొలి వారంలో ప్రేక్షకులు టికెట్లను కొనుగోలు చేసేందుకు సాధారణ ధరల కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.

- Advertisement -
Advertisement

also read:Nidhhi Agerwal:పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన నిధి అగర్వాల్..!

సింగిల్ స్క్రీన్లలో రూ.50.. మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంపు :

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, ‘జైలర్ 2’ (Jailer 2 )సినిమా ప్రదర్శించే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ పెంపు అక్టోబర్ 15 నుంచి 21వ తేదీ వరకు అమల్లో ఉండనుంది.

- Advertisement -
Advertisement

అంతేకాకుండా, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విడుదలైన తొలి వారంలో ఎక్కువ షోల ద్వారా ప్రేక్షకులకు సినిమా అందుబాటులో ఉండటంతో పాటు, పెరిగిన టికెట్ ధరలతో వసూళ్లు సాధించే అవకాశం చిత్ర బృందానికి లభించనుంది.

also read:Tollywood:టాలీవుడ్ స్టార్ హీరో కూతురు పెళ్లి..?

- Advertisement -
Advertisement

డబ్బింగ్ సినిమాకు టికెట్ ధరల పెంపు అవసరమా? :

భారీ బడ్జెట్‌తో రూపొందే తెలుగు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించినా, ఈ నిర్ణయంపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇతర భాషలో తెరకెక్కి తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న చిత్రానికి కూడా ధరల పెంపునకు అనుమతి ఇవ్వడం కొత్త చర్చకు దారితీసింది. ఈ పరిణామంపై కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, డబ్బింగ్ సినిమాలకు సైతం టికెట్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని, ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులపై అదనపు భారం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సినిమా నిర్మాణ వ్యయం, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ధరల పెంపు కోరుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలోనూ టికెట్ ధరలు పెరుగుతాయా? :

ఆంధ్రప్రదేశ్‌లో ‘జైలర్ 2’ టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించడంతో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కూడా ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనుమతి లభిస్తే టికెట్ ధరలను ఎంతవరకు పెంచే అవకాశం ఉంది? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you