Toxic OTT:కన్నడ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం టాక్సిక్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించగా.. ఇందులో హీరోయిన్స్ గా కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారాసుతారియా , అక్షయ్ ఒబెరాయ్, అమిత్ తివారి తదితర నటీనటులు ఇందులో నటించారు. సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్.. ఆగస్టు 26న విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి షో నుంచి నెగటివ్ టాక్ మూట కట్టుకొని భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా లాస్ అయినట్లు వినిపిస్తున్నాయి.
టాక్సిక్ ఓటీటీ పై వీడని ఉత్కంఠ..
టాక్సిక్(Toxic OTT) సినిమా ఓటీటీ విషయంపై కూడా గత కొద్ది రోజులుగా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. థియేటర్లో డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా ఓటీటీ లోనైనా చూడాలని యశ్ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సినిమా థియేటర్లలో విడుదల అయి ఇప్పటికి రెండు నెలలు కావస్తూ ఉన్నా.. ఓటీటి రిలీజ్ లోనూ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ కూడా రాకపోవడంతో అభిమానులు నిరాశలో కనిపిస్తున్నారు. సినిమా విడుదలైన మొదట్లో సినిమా సెప్టెంబర్ చివరి వారంలో వస్తుందని వార్తలు వినిపించాయి. జీ 5 ఈ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుందని రూమర్స్ కూడా వినిపించాయి.
also read:Garividi Lakshmi: గరివిడి లక్ష్మి సినిమాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్.. ఎవరెవరంటే
అందుకే ఆలస్యం..
కానీ అలాంటిదేమీ ఇప్పుడు కనిపించలేదు. అక్టోబర్ నెలలో కూడా స్ట్రిమింగ్ జాబితాలో టాక్సిక్ సినిమా పేరు ఎక్కడ కనిపించడం లేదు. దీనిపైన చిత్ర బృందం కానీ ఓటీటి సంస్థల నుంచి గాని ఎటువంటి అఫీషియల్ స్పందన కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు టాక్సిక్ ఓటీటి డీల్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థియేటర్లో టాక్సిక్ సినిమా భారీ డిజాస్టర్ కావడం చేత ఓటీటీ డీల్ ఆఫర్ ధర కూడా భారీగా తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
also read:Suma Kanakala:రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చూస్తే సుమ రియాక్షన్ ఇదే!
రూ.30 కోట్లు కూడా పలకని టాక్సిక్ ఓటిటీ హక్కులు..
మొదట టాక్సిక్ సినిమా ఓటిటి డీల్ 200 కోట్ల రూపాయల డీల్ కుదురుచుకున్నారని కానీ ఇప్పుడు కేవలం 30 కోట్ల రూపాయలే పలుకుతోందనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఓటిటి సంస్థ కూడా భారీ ధరలు పెట్టడానికి ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే టాక్సిక్ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుందనే విధంగా వినిపిస్తోందట. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్, యశ్ మాన్స్టర్ మైండ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.
యశ్ చిత్రాలు..
యశ్ చిత్రాల విషయానికి వస్తే బాలీవుడ్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రామాయణ అనే చిత్రంలో యశ్ రావణుడిగా నటించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. 2026 దీపావళి కానుకగా మొదటి భాగాన్ని విడుదల చేయబోతున్నారు. రెండవ భాగాన్ని 2027 దీపావళి కానుకగా విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఈ చిత్రాలతో యశ్ తన క్రేజీని నిలబెట్టుకుంటారేమో చూడాలి మరి.




