A.M.Ratnam:ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పైన ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను స్టార్ హీరోలకు అందించారు. తెలుగులో కర్తవ్యం, ఆశయం, సంకల్పం, ఖుషి, బంగారం, స్నేహం కోసం తదితర చిత్రాలను నిర్మించారు. తమిళంలో కూడా భారతీయుడు, 7/G బృందావన కాలనీ, బాయ్స్ వంటి చిత్రాలను కూడా నిర్మించారు. అలా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు సంపాదించుకున్న ఏ.ఎం రత్నం ఈ మధ్యకాలంలో వెనుక పడ్డారని చెప్పవచ్చు.
నా వల్లే నా కొడుకు కెరియర్ నాశనం అయ్యింది..
గత ఏడాది పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన హరిహర వీరమల్లు సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఏం రత్నంకు ఇద్దరు కుమారులు.. అందులో ఒకరు పలు చిత్రాలలో నటించిన హీరో రవి కృష్ణ, మరొకరు జ్యోతి కృష్ణ. పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ స్క్రీన్ ప్లే రైటర్ గా డైరెక్టర్ గా రాణిస్తున్నారు.. ఆక్సిజన్, నీ మనసు నాకు తెలుసు, కేడి, హరిహర వీరమల్లు తదితర చిత్రాలను దర్శకత్వం వహించారు జ్యోతి కృష్ణ.. రెండవ కుమారుడు రవికృష్ణ హీరోగా 7/G బృందావన కాలనీ సినిమాలు నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించినా.. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు.
also read:Rajinikanth:రజనీకాంత్ తో నాలుగోసారి జోడి కట్టనున్న స్టార్ హీరోయిన్!
నా కొడుకుకు సపోర్ట్ చేసే టైమ్ వచ్చింది..
ప్రస్తుతం 7/G బృందావన కాలనీ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన ఆయన ఆశలన్నీ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏ.ఎం.రత్నం(A.M.Ratnam) బడా నిర్మాత అయ్యుండి కూడా తన కొడుకు రవికృష్ణ కెరియర్ ను సరి చేయలేకపోయానని ఎన్నో సందర్భాలలో నిరాశకు గురయ్యారట. ఇటీవల ఒక ఛానల్లో మాట్లాడుతూ.. తన కుమారుడు రవికృష్ణ కెరియర్ పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు . నా సొంత పనులలో బిజీగా ఉండడం వల్ల నా కుమారుడి సినీ కెరీర్ కి అండగా నిలవలేకపోయాను అని , రవికి తన సపోర్టు చేయవలసి ఉంది అంటూ ఆయన అంగీకారంగా తెలియజేశారు.
also read:vk.naresh:మహేష్ బాబుతో బంధంపై ఇన్నాళ్ల ప్రచారానికి నరేష్ ఫుల్ స్టాప్!
కథ నచ్చకపోవడం వల్లే రిజెక్ట్ చేశారు..
రవికి బయట నుంచి దాదాపుగా 20 నుంచి 30 చిత్రాలలో నటించే అవకాశాలు కూడా లభించాయి. కానీ అందులో చాలా కథలు అతనికి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని, అందులో అరణ్యకాండం అనే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి డైరెక్టర్ జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు చరణ్ ఇందులో భాగస్వామిగా ఉన్నారు. మా కుటుంబాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండడం వల్లే ఈ చిత్రంలో రవి ఒక విభిన్నమైన నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారని తెలియజేశారు ఏ.ఎం రత్నం. తన కుమారుడి కెరీర్ కోసం సరైన ప్రణాళికను రూపొందించలేకపోయాను. కథల ఎంపిక విషయంలో చాలా పొరపాట్లు జరిగాయి అంటూ ఏ.ఎం.రత్నం తెలియజేశారు.




