BIGG BOSS:తెలుగు బిగ్ బాస్ సీజన్ 10లో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. కంటెస్టెంట్ల ఆటతీరుతో పాటు వారి వ్యక్తిగత విషయాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా షాలినీ పటేల్ ఎలిమినేషన్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈ షోలో పాల్గొనడం కోసం ఆమె ఆస్ట్రేలియాలోని ఉద్యోగాన్ని, వీసాను కూడా రిస్క్ చేసినట్లు గతంలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి.
సడన్ ఎలిమినేషన్‌తో షాలినీకి షాక్! :
బిగ్ బాస్(BIGG BOSS) హౌస్‌లో దక్షిణి ఓటింగ్ ద్వారా బయటకు వెళ్లగా, రెడ్ టీమ్ నుంచి కూడా ఒకరు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నాగార్జున ముందుగానే చెప్పారు. ఈ నేపథ్యంలో షాలినీ పటేల్ ఎలిమినేట్ అయిపోయింది.
షాలినీపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు :
హౌస్‌లో షాలినీ వ్యవహారశైలి, ఇతర కంటెస్టెంట్లతో ఆమె ప్రవర్తనపై మొదటి నుంచీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఆటతీరును సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె మాట్లాడే విధానం, రోహిత్‌తో ఉన్న సాన్నిహిత్యం వంటి అంశాలపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
షాలినీ ఎలిమినేషన్‌తో షో మరింత ప్రశాంతంగా ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఆమె ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
also read:A.M.Ratnam:నావల్లే నా కొడుకు కెరియర్ ఇలా అయింది.. ఏ.ఎం.రత్నం ఎమోషనల్ కామెంట్స్!
బిగ్ బాస్ కోసం ఆస్ట్రేలియా ఉద్యోగాన్ని రిస్క్ చేసిన షాలినీ:
షాలినీ పటేల్ వ్యక్తిగత నేపథ్యం కూడా ఆసక్తికరంగా మారింది. ఆమె కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొనే అవకాశం రావడంతో, అక్కడ తాను చేస్తున్న ఉద్యోగంతో పాటు ఆస్ట్రేలియా వీసా విషయంలోనూ రిస్క్ తీసుకుని షోలోకి అడుగుపెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను మా తాత కండీషన్ సీరియస్ అని అబద్ధం చెప్పి ఇండియా వచ్చాను అని.. ఈ విషయం మా మ్యానేజర్ కి తెలియదు అని చెప్పారు. అసలు ఇప్పుడు నా జాబ్ ఉందో లేదో..? ఏం అవుతుందో కూడా తెలియదు అని చెప్పుకొచ్చారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయానని, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ స్వయంగా ఈ స్థాయికి చేరుకున్నానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యం ఆమె ప్రయాణంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
also read:Rajinikanth:రజనీకాంత్ తో నాలుగోసారి జోడి కట్టనున్న స్టార్ హీరోయిన్!
బయటకు వచ్చాక షాలినీ ఎలా స్పందిస్తుందో?:
హౌస్‌లో ఉన్నప్పుడు తనపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాల గురించి బయటకు వచ్చిన తర్వాత షాలినీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే రోహిత్‌తో తన అనుబంధంపై ఆమె ఏమైనా స్పష్టత ఇస్తుందా? తన ఆటతీరుపై వచ్చిన విమర్శలను ఎలా స్వీకరిస్తుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఈ పరిణామాలపై ఆమె స్పందన ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే…???




