OM Movie Glimpse:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ఓం. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ కూడా భారీగా పాపులారిటీ సంపాదించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ సాయి పల్లవి క్యారెక్టర్ ని ఇంట్రడక్షన్ చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో సాయి పల్లవి నిత్య రెడ్డి అనే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సాయి పల్లవి ఇప్పటివరకు చేయని ఒక విభిన్నమైన పాత్రలో ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.
నిత్యా రెడ్డిగా ఆకట్టుకుంటున్న సాయి పల్లవి..
సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్‌గా తనదైన స్క్రీన్ ప్రజెంట్స్ తో అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నట్లు ఈ గ్లింప్స్ లో కనిపిస్తోంది. గ్లింప్స్(OM Movie Glimpse) విషయానికి వస్తే ఓ ఐ పీ ఎస్ ఆఫీసర్‌గా చాలా ఎత్తుకు ఎదిగిన నిత్యా రెడ్డి.. ఎర్రచందనం స్మగ్లింగ్ ని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్‌గా అపాయింట్మెంట్ చేస్తారు.. ఆ తర్వాత ఆమె ఎదురుకున్న పరిణామాలు ఏంటి అనేది ఇందులో చాలా ఎమోషనల్ గా చూపించారు. సాయి పల్లవి షార్ట్ హెయిర్ తో సరికొత్త లుక్కుతో ఆకట్టుకుంది. అంతేకాకుండా సాయి పల్లవి ఇందులో యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది.
also read:Prabhas Fauzi:ప్రభాస్ సినిమాపై నేతాజీ మనవడి ఫైర్.. దర్శకుడికి కీలక డిమాండ్!
పాన్ ఇండియా భాషల్లో విడుదల..
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఓం ఫస్ట్ స్ట్రైక్ మమ్ముట్టి, బర్మా కార్తికేయన్ క్యారెక్టర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే విడుదల చేశారు. ఓం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటు ఇటీవలే వచ్చిన రెండో పాట వీరా పాట కూడా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది. ముఖ్యంగా సాయి అభ్యాంకర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ పాటను విడుదల చేశారు. ఇప్పుడు సాయి పల్లవి క్యారెక్టర్ ని ఇంటర్వ్యూ చేయడంతో ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు.
also read:January 12na vidudala Movie:జనవరి 12న విడుదల.. సినిమా బిజినెస్ డీల్ అదిరిందిగా..?
రామాయణతో కూడా ప్రేక్షకుల ముందుకు..
ఓం చిత్రాన్ని ఆర్టెక్ స్టూడియో బ్యానర్ పైన, ధనుష్ తో కలిసి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, శ్రీ లీల, నసీరుద్దీన్ , సాయి పల్లవి కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అలాగే సాయి పల్లవి నటించిన మరో భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. ఈ సినిమా కూడా ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి ఈ రెండు చిత్రాలు సాయి పల్లవికి ఏ విధంగా కలిసొస్తాయో చూడాలి మరి. చివరిగా 2025లో నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా ఏడాది పాటు మళ్ళీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఇప్పుడు ఈ సినిమాలతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.




