Comedian Ali:తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో స్టార్ హీరోల చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా, కమెడియన్ గా కూడా ప్రేక్షకులను అలరించారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆలీ కేవలం నటుడు గానే కాకుండా యాంకర్ గా కూడా ఆకట్టుకున్నారు. అలాగే రాజకీయాలలోకి వెళ్లి సినిమాలకు దూరమై మళ్ళీ సినిమాలలో నటించేందుకు రీ ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా చాలా తక్కువగానే అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
భార్యకు సర్జరీ.. వెక్కివెక్కి ఏడ్చిన ఆలీ..
ఆలీ పర్సనల్ లైఫ్ విషయానికి వెళ్తే.. ఆలీ భార్య(Comedian Ali) జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటలకు సంబంధించిన వీడియోలను నా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆలీ భార్య జుబేదా కు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో ఆమెకు హార్ట్ సర్జరీ చేయవలసి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
also read:OM Movie Glimpse:ఓం సినిమా నుంచి ఐపీఎస్ నిత్యా రెడ్డి గా సాయి పల్లవి గ్లింప్స్ వైరల్..!
అసలేం జరిగిందంటే?
జుబేదాకు హార్ట్ సర్జరీ సక్సెస్ అయ్యిందని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉంటూ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఎంతో చలాకీగా ఉండే భార్య జుబేదాను ఆసుపత్రిలో చూసి ఆలి ఒక్కసారిగా వెక్కివెక్కి ఏడ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు సైతం చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఆలీ భార్య త్వరగా కోలుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఈ విషయంపై కమెడియన్ ఆలీకి సైతం ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
also read:Prabhas Fauzi:ప్రభాస్ సినిమాపై నేతాజీ మనవడి ఫైర్.. దర్శకుడికి కీలక డిమాండ్!
జుబేదా, ఆలీల వివాహం..
1994 జనవరి 23న జుబేదా సుల్తానా బేగం, ఆలీల వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కలరు. ఇద్దరు కుమార్తెలు ఒక అబ్బాయి ఉన్నారు. ఆలీ సినిమాల విషయానికే వస్తే.. ఇటీవల మహేంద్రగిరి వారాహి అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో హీరో అక్కినేని సుమంత్ నటించారు. ప్రస్తుతం ఆలీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉండడమే కాకుండా బుల్లితెర పైన కూడా హోస్టుగా రాణిస్తున్నారు. ఆలీ భార్యకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.




