Saluri Vasu Rao:తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం రామాయణం ప్రాజెక్టుతోనూ వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసు రావు ఆమెపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాయి పల్లవి వ్యక్తిగత అభిప్రాయాలు, రామాయణం ప్రాజెక్టులో ఆమె పాత్రకు సంబంధించిన అంశాలపై ఆయన స్పందించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
సాయి పల్లవిపై సాలూరి వాసు రావు వ్యాఖ్యలు :
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత దర్శకుడు సాలూరి వాసు రావుకు సాయి పల్లవికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె దేవుడిపై తనకున్న నమ్మకానికి సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. దేవుడిపై నమ్మకం లేదని చెప్పే వ్యక్తి రామాయణం వంటి ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఎలా నటిస్తారని ఆయన ప్రశ్నించారు.
సాయి పల్లవి రామాయణం ప్రాజెక్టులో భాగం కావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సీతాదేవి పాత్రకు ఆమె సరిపోరని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.
also read:Jailer 2 OTT:ఓటిటిలోకి జైలర్ 2 .. ఎప్పుడు?ఎందులో అంటే..?
సీతాదేవి పాత్రకు నయనతార సరైన ఎంపిక :
ఈ సందర్భంగా సీతాదేవి పాత్రకు నటి నయనతార సరైన ఎంపిక అని సాలూరి వాసు రావు(Saluri Vasu Rao) అభిప్రాయపడ్డారు. గతంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నయనతార సీతాదేవిగా నటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సినిమా సమయంలో ఆమె పాటించిన నియమాలు, దైవభక్తికి సంబంధించిన విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే ఒక నటికి వ్యక్తిగతంగా దేవుడిపై ఉన్న నమ్మకానికి, తెరపై ఒక పాత్రను పోషించే సామర్థ్యానికి మధ్య సంబంధం ఏమిటనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇతిహాస పాత్రల్లో నటించే వారి వ్యక్తిగత విశ్వాసాలపై చర్చ జరగడం సహజమే అయినప్పటికీ, నటనా ప్రతిభను అంచనా వేయడానికి అవే ఏకైక ప్రమాణాలు కావని కొందరు అభిప్రాయపడుతున్నారు.
also read:Comedian Ali:కమెడియన్ ఆలీ భార్యకి సర్జరీ.. ఎమోషనల్ అయిన ఆలీ.. వీడియో వైరల్..!
సాయి పల్లవి అభిమానుల కౌంటర్లు :
సాలూరి వాసు రావు వ్యాఖ్యలపై సాయి పల్లవి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి దేవుడిపై నమ్మకం ఉందా లేదా అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని, వృత్తిపరమైన బాధ్యతలను దానితో ముడిపెట్టడం సరికాదని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి నటన, పాత్రపై అవగాహన, భావోద్వేగాలను పలికించే సామర్థ్యం ముఖ్యమని పేర్కొంటున్నారు.
మరోవైపు, రామాయణం వంటి గొప్ప ఇతిహాసంలో సీతాదేవి పాత్రను పోషించే నటుల ఎంపికపై ప్రేక్షకుల్లో సహజంగానే అంచనాలు ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది..!!




