Wednesday, October 28, 2026
HomeLATESTTrivikram:హీరోయిన్ కాళ్లు మొక్కబోయిన డైరెక్టర్ త్రివిక్రమ్!

Trivikram:హీరోయిన్ కాళ్లు మొక్కబోయిన డైరెక్టర్ త్రివిక్రమ్!

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యంగ్ హీరోయిన్ కాళ్లు మొక్కడానికి ప్రయత్నించడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

on
- Advertisement -banner Ad

Trivikram:టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ సినిమా వాస్తవంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వస్తూ అక్టోబర్ 30వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్..

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పైన స్పీడ్ పెంచిన చిత్ర బృందం.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు చిత్ర బృందం పాల్గొనడంతో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచింది. ముఖ్యంగా పింకు కలర్ చీరలో ట్రెడిషనల్ గా బ్యూటిఫుల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంది. అలాగే మరొక హీరోయిన్ నివేదా పేతురాజు కూడా చీర కట్టులో బాగా ఆకట్టుకుంది. ఇక ఈవెంట్లో శ్రీనిధి శెట్టి అందరి పెద్దలకు నమస్కారం చేస్తూ వస్తూ ఉండగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరకు రాగానే ఆయన కాళ్లకు పాదాభివందనం చేయడానికి ప్రయత్నించింది.

- Advertisement -
Advertisement

also read:Kavya Maran:అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఆ హీరోకే పిలుపు.. ఎవరో తెలుసా?

త్రివిక్రమ్ కాళ్ళు మొక్కిన శ్రీనిధి..

కానీ శ్రీనిధి శెట్టికి ఊహించని విధంగా త్రివిక్రమ్(Trivikram) కూడా వెంటనే తిరిగి శ్రీనిధి శెట్టి పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించారు. అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాన్ని చూసిన సీనియర్ యాంకర్ సుమ ఏంటది అక్కడ ఏం జరుగుతోంది? అంటూ సరదాగా అనడంతో అభిమానులంతా కూడా ఒకసారిగా ఈలలు, కేకలతో అరచి గోల చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఘటన పైన పలువురు నెటిజన్స్ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Nivetha Pethuraj:స్టేజీ పై ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టిన నివేదా పేతురాజు..!

సోషల్ మీడియాలో చర్చ?

త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి మధ్య కేవలం పరస్పర గౌరవంతోనే సరదాగా చేసిన పనే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది తనకంటే వయసులో అనుభవంలో చాలా చిన్నదైన హీరోయిన్ పాదాలను తాకాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదు అంటూ మరి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా త్రివిక్రమ్ మాత్రం ఇలా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం కావడంతో మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మరి అదే సెంటిమెంట్ ఆదర్శ కుటుంబానికి కూడా కలిసొస్తుందేమో చూడాలి మరి. శ్రీనిధి శెట్టికి కూడా సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you