Pooja Hegde:రీసెంట్గా కాఫీ విత్ కరెంట్ షో గురించి ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ షోలో గెస్ట్లుగా పాల్గొన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు సంబంధించిన ఇష్యూ పెద్ద హైలైట్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా, ఈ షోలో అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ కాల్ చేయడం, అల్లు అర్జున్ ఎంతో ఓపికగా రెస్పాండ్ అవ్వడం ఇంకా హైలైట్‌గా మారింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ వీడియో ని బాగా హైలెట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
పూజా హెగ్డే కోసం అల్లు అర్జున్ సర్ప్రైజ్ కాల్ :
అయితే, ఇప్పుడు తాజాగా మరొక టాక్ షోకి అల్లు అర్జున్ గెస్ట్‌గా కాల్ చేశాడు. దీంతో ఈ న్యూస్ బాగా హీట్ పెంచేసింది. అది కూడా అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే కోసం కాల్ చేశాడు. పూజా కూడా చాలా సర్ ప్రైజ్ గా ఫీల్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తూ, హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో పూజా హెగ్డే:
మనందరికీ తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ప్రముఖ టెలివిజన్ షోల్లో టాక్ షోలు ఎక్కువగా మారిపోయాయి. స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి, వాళ్ల లైఫ్‌లో దాగి ఉన్న మూమెంట్స్ గురించి టాక్ షోల ద్వారా బయటపడుతూ వస్తున్నాయి. తాజాగా జగపతిబాబు ఓ టాక్ షోకి హోస్ట్‌గా చేస్తున్నారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోకి జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తాజాగా పూజా హెగ్డే చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
also read:Trivikram:హీరోయిన్ కాళ్లు మొక్కబోయిన డైరెక్టర్ త్రివిక్రమ్!
ప్రోమోలో హరీష్ శంకర్ ఎంట్రీ.. అల్లు అర్జున్ కాల్ :
అయితే, స్టార్టింగ్ నుంచి పూజా హెగ్డేను(Pooja Hegde) హైలైట్ చేస్తూ జగపతిబాబు మాట్లాడారు. అంతేకాదు, ఈ టాక్ షోలో సడన్ సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. పూజా హెగ్డే మాట్లాడుతున్నప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ ఎంటర్ అవుతాడు. ఇక ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ సర్ప్రైజ్ కాల్ చేస్తాడు.అంతేకాదు, అల్లు అర్జున్ “పూజా హెగ్డేనా.. మేడం సార్.. మేడం అంతే” అంటూ ఫైనల్ టచ్ ఇచ్చిన డైలాగ్ ప్రోమోకి హైలైట్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
also read:Kavya Maran:అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఆ హీరోకే పిలుపు.. ఎవరో తెలుసా?
అల్లు అర్జున్ – పూజా హెగ్డే హిట్ ట్రాక్‌పై ప్రశంసలు :
అల్లు అర్జున్, పూజా హెగ్డే హిట్ ట్రాక్ అంటూ జనాలు పొగిడేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వీళ్లిద్దరి కాంబో సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకుముందు వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ అయితే వేరే లెవెల్. అందుకే వీళ్ల కాంబోను జనాలు బాగా ప్రశంసిస్తూ ఉంటారు. త్వరలోనే వీళ్ల కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో!




