Fauzi Teaser:పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ హానురాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఫౌజీ. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం బ్రిటిష్ ఇండియా కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఒక ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఇటీవల ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. కానీ అదే స్థాయిలో టీజర్ పైన వివాదం చెలరేగుతోంది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ పాత్ర చిత్రీకరణ పైన ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రమంత్రికి లేఖ రాసిన నేతాజీ మనవడు..
నేతాజీ మనవడు వరసయ్యే చంద్రకుమార్ బోస్ ఫౌజీ సినిమా టీజర్ (Fauzi Teaser)ని తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్. ఫౌజీ చిత్రం విడుదలైన తర్వాత చిత్ర బృందం పైన ఫైర్ అయ్యారు చరిత్రకు కల్పిత కథను జోడించడం నేరమని, ఈ సినిమా మేకర్స్ భారత ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ తెలియజేశారు. ఆ వెంటనే ఫౌజీ టీజర్ ని కూడా తొలగించాలని చంద్రకుమార్ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్..
చరిత్ర వక్రీకరణకు తావులేని విధంగా కొత్త టీజర్ ని రిలీజ్ చేయాలని, నేతాజీ పాత్రకు సంబంధించి మాకు ఉన్న అభ్యంతరాలు పరిష్కారమైతే.. (టీజర్, సినిమా రెండిటి విషయంలో) ప్రభాస్ మరియు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. డైరెక్టర్ హనురాగవపూడి ఈ విషయంలో తీవ్రతను గుర్తిస్తారని ఆశిస్తున్నానని ఆయన ట్విట్ చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కి ఒక లేఖను కూడా చంద్రకుమార్ పంపించినట్లు ఈ ట్వీట్లో తెలియజేశారు.
also read:Karthik Subbaraj:గేమ్ ఛేంజర్ కథను మార్చేశారు.. అసలు విషయం బయటపెట్టిన కార్తిక్ సుబ్బరాజ్!
టీజర్ తొలగించాలని విన్నపం..
టీజర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్ తో మాట్లాడుతూ ఫౌజీ అనే కల్పిత పాత్రను పరిచయం చేస్తున్నట్లు చూపించారు. నేతాజీ పాత్రను ఇలా తేలికపరిచి చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి అభ్యంతరకరమైన కంటెంట్ ని సెన్సార్ బోర్డు ఎలా క్లియర్ చేస్తుందో మాకు అర్థం కావడం లేదు అంటూ.. ఈ విషయాన్ని పరిశీలించి తగిన విచారణ జరిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము అంటూ సుభాష్ చంద్రబోస్ మనవడు ఒక లేఖను అశ్వని వైష్ణవ్ కి రాశారు. ఈ టీజర్ ను వెంటనే తొలగించి సెన్సార్ బోర్డులో దీనికి బాధ్యులైన వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
also read:Ritika Naik :కాబోయే భర్త గురించి ఓపెన్ అయిన రితికా నాయక్..!
చిత్ర బృందం స్పందిస్తుందా?
ఫౌజీ సినిమా టీజర్ సుమారుగా రెండున్నర నిమిషాల నిడివి కలదు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్, సుభాష్ చంద్రబోస్ మధ్య జరిగే సంభాషణతోనే మొదలవుతుంది. ఆ సమయంలోని భారతీయ గూఢచారి గురించి నేతాజీ ప్రస్తావిస్తూ కలకత్తాలో ఉన్న వ్యక్తి ఫౌజీ అని పరిచయం చేస్తూ ప్రభాస్ ని చూపించారు. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను తక్కువ చేసి చూపించారని, చరిత్రను వక్రీకరించారంటూ చంద్రకుమార్ బోస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
The teaser of Fauzi ought to be pulled down, corrected and released again. Should our concern regarding Netaji be resolved (for the teaser as well as for the Movie), my best wishes go out for #Prabhas and the entire team @FauziTheMovie . Hope @hanurpudi realises the seriousness @narendramodi @AshwiniVaishnaw @SuparnoSatpathy
— Chandra Kumar Bose (@Chandrakbose) October 27, 2026




