Nara Rohit:విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇటీవలే హైదరాబాదులో జరగగా.. చిత్ర బృందంతో పాటు నటీనటులు కూడా పాల్గొన్నారు. అయితే ఆదర్శ కుటుంబం సినిమాలో హీరో నారా రోహిత్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నారా రోహిత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల పైన ఆయన చేసిన కంప్లైంట్ వైరల్ గా మారింది.
త్రివిక్రమ్, వెంకటేష్, తమన్ పై నారా రోహిత్ కంప్లైంట్..
ఎప్పుడు సైలెంట్ గా, క్రమశిక్షణగా ఉండే నారా రోహిత్ , త్రివిక్రమ్, తమన్, వెంకటేష్ లపైన కంప్లైంట్ చేయాలంటూ యాంకర్ కోరడంతో ఆయన సరదాగా వారికి సంబంధించిన ఒక విషయాన్ని బయటపెట్టారు.. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో పని చేయడం ఒక వండర్ఫుల్ మూమెంట్ అని ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటూ తెలిపారు.. అంతేకాకుండా ఒక ఫన్నీ కంప్లైంట్ ఉందంటూ నారా రోహిత్ తెలిపారు. త్రివిక్రమ్ గారితో అంతా బాగుంటుంది కానీ ఆయన ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మాత్రం చాలా టైం తీసుకుంటారంటూ.. త్రివిక్రమ్ గురించి నెమ్మదితనాన్ని బయటపెట్టారు నారా రోహిత్.
also read:Keerthy Suresh:హీరోయిన్ కీర్తి సురేష్ కి వేధింపులు?
తమన్ రహస్యం బయటపెట్టిన నారా రోహిత్..
అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పైన మాట్లాడుతూ.. ఆయన మంచి సాంగ్స్ ముందుగా విడుదల చేయకుండా దాచేస్తూ ఉంటారు.. అలా పోనిటైల్ పిల్ల అనే పాటను జ్యూక్ బాక్స్ కన్నా ముందే రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అంటూ తన అభిప్రాయంగా తెలిపారు. హీరో వెంకటేష్ పైన కంప్లైంట్ ఏమీ లేదు.. ఆయన సెట్ లో ఎప్పుడు స్పిరిచువల్ విషయాల గురించి మాట్లాడుతూ.. నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారని, ఆ మాటలు నేరుగా మనసులో నుంచి వస్తాయని ప్రశంసలు కురిపించారు నారా రోహిత్(Nara Rohit). అలాగే మరొకవైపు హీరోయిన్ నివేదా పేతురాజు తో తనకి ఎక్కడ కాంబినేషన్ సీన్స్ లేకపోవడం వల్ల ఆమె గురించి ఏమీ చెప్పలేనని తెలియజేశారు.
also read:Katrina Kaif:బాడీ షేమింగ్ ట్రోల్స్ పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన కత్రినా కైఫ్..!
ఈ సినిమాతో నారా రోహిత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో?
ఏది ఏమైనా నువ్వు నాకు నచ్చావు వంటి క్లాసిక్ సినిమాలను ఇష్టపడే నారా రోహిత్ కి , ఇప్పుడు అదే డైరెక్టర్ తో నటించే అవకాశం రావడంతో ఆనందపడుతున్నారు. ఆదర్శ కుటుంబం సినిమాలో ఒక మంచి పాత్ర చేయడం స్టేజి మీద టీం అందరితో ఇలా సరదాగా ఉండడం అభిమానులను మరింత ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇందులో నారా రోహిత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలోకనిపించబోతున్నారు. చివరిగా నారా రోహిత్ గత ఏడాది భైరవం, సుందరకాండ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆదర్శ కుటుంబం సినిమాలో కీలకమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.




